కరెంట్‌ అఫైర్స్‌

ప్రాజెక్ట్‌ 15బీ లో భాగంగా ఇటీవల భారత నౌకాదళంలో చేరిన మూడో స్టెల్త్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డిస్ట్రాయర్‌ నౌక ఏది?  

Published : 04 Dec 2023 06:24 IST

మాదిరి ప్రశ్నలు

ప్రాజెక్ట్‌ 15బీ లో భాగంగా ఇటీవల భారత నౌకాదళంలో చేరిన మూడో స్టెల్త్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డిస్ట్రాయర్‌ నౌక ఏది?    

జ: యార్డ్‌ 12706 (ఇంఫాల్‌)

మహిళా నాయకులకు సాధికారత కల్పించడం, ఆహార భద్రతను పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా ఏ రాష్ట్రంలో అమలవుతున్న ‘హంగర్‌ ప్రాజెక్టు’కు మద్దతుగా 2026, సెప్టెంబరు వరకు మూడేళ్ల కాలానికి 44.7 మిలియన్‌ డాలర్లు అందించడానికి నార్వే అంగీకరించింది?

జ: ఉత్తరాఖండ్‌

ఘోస్ట్‌ పార్టికల్స్‌ లేదా న్యూట్రినోలు అని పిలిచే అంతుచిక్కని కణాలను గుర్తించడమే లక్ష్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో డిటెక్టింగ్‌ టెలిస్కోప్‌ నిర్మాణాన్ని ఏ దేశం ప్రారంభించింది?  

జ: చైనా        

ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

జ: అక్టోబరు 24

ఏ రాష్ట్రంలోని థోర్డో గ్రామం యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ ్బగీవిజూగివ్శీ ప్రకటించిన 54 ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామాల జాబితాలో చోటు దక్కించుకుంది?

జ: గుజరాత్‌

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ కార్యక్రమం కోసం రూపొందించిన ఏ టెస్ట్‌ వెహికల్‌ను 2023, అక్టోబరులో విజయవంతంగా పరీక్షించారు?

జ:  టెస్ట్‌ వెహికల్‌ - D1(TVD1)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని