మొదటి అద్భుత ఔషధం పెన్సిలిన్‌!

జీవుల గురించి తెలుసుకోవాలంటే ముందు ఆ జీవికి నిర్దిష్టమైన పేరు ఉండాలి. ఆ విధంగా జీవులను గుర్తించి వాటికి పేర్లు పెట్టి, ఒకేవిధమైన లక్షణాలతో ఉన్న జీవుల సమూహాన్ని జాతులుగా వర్గీకరించి, లక్షణాలను విశ్లేషించేదే వర్గీకరణ శాస్త్రం. 

Published : 21 Feb 2024 01:39 IST

జనరల్‌ స్టడీస్‌ బయాలజీ

జీవుల గురించి తెలుసుకోవాలంటే ముందు ఆ జీవికి నిర్దిష్టమైన పేరు ఉండాలి. ఆ విధంగా జీవులను గుర్తించి వాటికి పేర్లు పెట్టి, ఒకేవిధమైన లక్షణాలతో ఉన్న జీవుల సమూహాన్ని జాతులుగా వర్గీకరించి, లక్షణాలను విశ్లేషించేదే వర్గీకరణ శాస్త్రం.  జీవజాతుల ఆవిర్భావం, అభివృద్ధి,  పరిణామ క్రమాన్ని సమగ్రంగా ఆవిష్కరించే ఈ జీవశాస్త్ర విభాగం ప్రాథమికాంశాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. జంతురాజ్యం, వృక్షరాజ్యంలోని ఉపవర్గాలు, అవి పెరిగే వాతావరణ పరిస్థితులతో పాటు ముఖ్యమైన జంతువులు, వృక్షాల  శాస్త్రీయ నామాలు, వైద్యపరంగా వాటికి ఉన్న ఉపయోగాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

వర్గీకరణ శాస్త్రం

1. ద్వినామీకరణను మొదట ఎవరు కనుక్కున్నారు?

1) లీవెన్‌ హుక్‌     2) రాబర్ట్‌ హుక్‌    
3) అరిస్టాటిల్‌ 4) బాహిన్‌

2. ‘మైక్రోగ్రాఫియా’ గ్రంథకర్త?

1) లిన్నేయస్‌     2) బాహిన్‌    
3) రాబర్ట్‌ హుక్‌   4) లీవెన్‌ హుక్‌

3. ‘జీవ పరిణామం’ అనే పదాన్ని ప్రతిపాదించింది?

1) బేట్సన్‌     2) హెర్బర్ట్‌ స్పెన్సర్‌  
3) అరిస్టాటిల్‌ 4) లిన్నేయస్‌

4. ‘వర్గవికాస వర్గీకరణ’ను వృక్ష రూప చిత్రంగా ఎవరు రూపొందించారు?

1) లిన్నేయస్‌     2) ఎర్నెస్ట్‌ బి.చైన్‌    
3) అరిస్టాటిల్‌ 4) ఎర్నెస్ట్‌ హెకెల్‌

5. వర్గీకరణలో నిమ్నస్థాయి ప్రమాణం?

1) జాతి   2) ప్రజాతి    
3) కుటుంబం   4) క్రమం

6. శాస్త్రీయ నామాలను ముద్రించే భాష?

1) లాటిన్‌  2) జర్మన్‌  3) అరబిక్‌  4) ఇటాలిక్‌

7. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) శాస్త్రీయ నామంలో జాతి, ప్రజాతి, ఉప జాతి అనే పదాలుంటాయి.
2) ద్వినామీకరణను ఉపయోగించింది - లిన్నేయస్‌
3) నాగుపాము శాస్త్రీయ నామం - నాజా నాజా
4) సింహం శాస్త్రీయ నామం - పాంథారా టైగ్రీస్‌

8. కిందివాటిని జతపరచండి.

1) పురాతన వర్గీకరణ పిత  (  )  ఎ) లిన్నేయస్‌
2) ద్వినామీకరణ పిత     (  )  బి) జాన్‌ రే
3) ఆధునిక వర్గీకరణ పిత  (  )  సి) అరిస్టాటిల్‌
4) జాతిని ప్రతిపాదించింది  (  )  డి) విట్టేకర్‌
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి  
2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి  
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి    
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ

9. పారాజోవాలోని ఏకైక వర్గం?

1) నిడేరియా     2) ప్రోటోజోవా    
3) పొరిఫెరా     4) ప్రోటోస్టోమియా

10. అధర్వణ వేదం గ్రంథకర్త?

1) అంగీరస     2) అధర్వణ    
3) పరాశరుడు   4) 1, 2

11. కిందివారిలో వృక్షశాస్త్ర పిత?

1) థియో ఫాస్ట్రస్‌   2) అరిస్టాటిల్‌    
3) పరాశరుడు   4) 1, 3

12. అల్లం జీవిత కాలం ఎన్ని సంవత్సరాలు?  

1) 4     2) 6     3) 2     4) 3

13. కిందివాటిలో ఏకదళ బీజం కానిది?

1) రాగులు     2) జొన్నలు  
3) గోధుమలు   4) ఆవాలు

14. ఆమ్ల నేలలో పెరిగే మొక్కలకు ఏమని పేరు?

1) ఆక్సాలోఫైట్స్‌   2) హాలోఫైట్స్‌  
3) ఎఫిఫైట్స్‌ 4) సోమో ఫైట్స్‌

15. కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

ఎ) మొదటగా అస్సీరియన్లు పంట, పైరు    మొక్కలను చిత్రాల రూపంలో భద్రపరిచారు.
బి) చిత్రాల రూపంలో భద్రపరచడాన్ని హీరోగ్లాఫిక్స్‌ అంటారు.
సి) చరకుడు తన ‘చరక సంహిత’లో ఔషధ మొక్కల గురించి వివరించాడు.
డి) రెండు ప్రధాన రాజ్యాల సృష్టి కర్త - అరిస్టాటిల్‌      
1) ఎ, బి, సి     2) ఎ, సి, డి    
3) ఎ, బి     4) పైవన్నీ

16. ఉపవన వినోదిని గ్రంథకర్త?

1) సారంగధరుడు     2) అంగీరస    
3) అధర్వణ     4) అరిస్టాటిల్‌

17. కిందివాటిలో ఏకదళ బీజం కానిది?

1) ఖర్జూరం   2) ఈత    
3) కొబ్బరి   4) నీల గోరింట

18. కిందివాటిని జతపరచండి.  

1) రెండు రాజ్యాల (  ) ఎ) విట్టేకర్‌
   వర్గీకరణ  
2) రెండు ప్రధాన (  ) బి) ఎర్నెస్ట్‌ హెకెల్‌
   రాజ్యాల వర్గీకరణ      
3) ఐదు రాజ్యాల వర్గీకరణ (  ) సి) అరిస్టాటిల్‌
4) మూడు రాజ్యాల (  ) డి) లిన్నేయస్‌
   వర్గీకరణ      
1) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ  
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి  
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ  
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి

19. ‘మొనిరా’ రాజ్యాన్ని పరిచయం చేసింది ఎవరు?

1) అరిస్టాటిల్‌   2) కోప్‌లాండ్‌  
3) లిన్నేయస్‌   4) విట్టేకర్‌

20. కిందివాటిలో స్వల్వకాలిక పంటను ఎన్నుకోండి.

1) పల్లేరు   2) వరి  
3) గోధుమ   4) అల్లం

21. వెంపలి కిందివాటిలో దేనికి చెందుతుంది?

1) గుల్మం    2) వృక్షం   3) తీగ   4) పొద

22. శాస్త్రీయ నామంలో జాతి, ప్రజాతి రెండూ ఒకే పదం అయితే దాన్ని ఏమంటారు?

1) టోటిపొటెన్సీ     2) టాటోనిమ్‌    
3) టాక్సా   4) 1, 3

23. శాస్త్రీయ నామంలో విశేషణాన్ని సూచించేది?

1) ప్రజాతి  2) జాతి   3) ఉప జాతి  4) వర్గం

24. వర్గీకరణలో అత్యున్నత ప్రమాణం?

1) కుటుంబం 2) క్రమం  3) రాజ్యం 4) తరగతి

25. కిందివాటిని వరుసలో అమర్చండి.

ఎ) కుటుంబం     బి) ప్రజాతి    
సి) క్రమం   డి) జాతి
1) డి, బి, సి, ఎ   2) డి, బి, ఎ, సి
3) డి, ఎ, సి, బి   4) డి, సి, బి, ఎ

26. వర్గీకరణ స్థాయిలో ఏ స్థాయి ప్రమాణాన్ని ఏమంటారు?

1) టాక్సా 2) టాక్సాన్‌ 3) టాక్సానమీ 4) 1, 2

27. జతపరచండి.

1) చార్‌సోఫైట్స్‌    (   )  ఎ) సాధారణ నేల
2) జీరోఫైట్స్‌      (   )  బి) లవణ నేల
3) హాలోఫైట్స్‌     (   )  సి) బంజరు నేల
4) మేసోఫైట్స్‌     (   )  డి) ఎడారి నేల
1) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి  
2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి  
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ  
4) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి

28. సూర్యకాంతి సమక్షంలో పెరిగే మొక్కల్ని ఏమంటారు?

1) హీలియోఫైట్స్‌     2) లిథోఫైట్స్‌    
3) క్రయోఫైట్స్‌     4) 1, 2

29. కిందివాటిలో పిండరహిత మొక్కలు-

1) టెరిడోఫైటా     2) బ్రయోఫైటా    
3) థాలోఫైటా       4) 1, 2

30. ద్వినామీకరణను వ్యతిరేకించిన వ్యక్తి-

1) అరిస్టాటిల్‌       2) బాసిన్‌      
3) లిన్నేయస్‌       4) రివైనస్‌

31. ప్రస్తుతం అమల్లో ఉన్న వర్గీకరణ విధానం-

1) 2 రాజ్యాలు       2) 5 రాజ్యాలు    
3) 4 రాజ్యాలు       4) 6 రాజ్యాలు  

32. భారతదేశ ఆధునిక వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు?

1) ట్రాన్స్‌బర్గర్‌     2) పరాశరుడు      
3) అంగీరస       4) అధ్వరణ

33. కిందివాటిలో వేటిని ‘కాలుష్య సూచీలు’ అంటారు?

1) టెరిడోఫైటా       2) థాలోఫైటా      
3) బ్రయోఫైటా       4) 1, 2

34. రెండు సామ్రాజ్యాల పితామహుడు-

1) చాటన్‌     2) కోప్‌లాండ్‌    
3) స్మిత్‌       4) లిన్నేయస్‌

35. వర్గీకరణ అనే పదాన్ని సూచించింది-

1) జాన్‌ రే     2) అరిస్టాటిల్‌    
3) లిన్నేయస్‌     4) డీ కండోల్‌

36. జీవుల పుట్టుక అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?

1) ఛార్లెస్‌ డార్విన్‌     2) లిన్నేయస్‌    
3) విట్టేకర్‌     4) స్మిత్‌

37. పుష్పించని మొక్కల్లో లేనిది

1) థాలోఫైటా       2) ద్విదళ బీజాలు    
3) టెరిడోఫైటా       4) బ్రయోఫైటా

38. కిందివాటిలో సగ్గు బియ్యం తయారీలో ఉపయోగించే మొక్క ఏది?

1) ఫెర్న్‌       2) అబిస్‌ ఆల్బా      
3) సైకస్‌     4) కర్ర పెండలం

39. వివృత బీజాలపై ప్రయోగం చేసింది-

1) బీర్బల్‌ సాహ్ని 2) అరిస్టాటిల్‌    
3) లిన్నేయస్‌     4) కోప్‌లాండ్‌

40. కింది వాటిలో ఏ రెండింటి సహజీవనం వల్ల మృత్తిక ఏర్పడుతుంది?

1) శైవలాలు     2) లైకేన్లు    
3) బ్రయోఫైటా   4) 2, 3

41. లైకేన్ల పితామహుడు...

1) మైకెల్‌       2) పిట్చ్‌      
3) అవస్థ పట్వర్ధన్‌     4) లిన్నేయస్‌  

42. ప్రపంచంలో మొదటి అద్భుత ఔషధం?

1) పెన్సిలిన్‌       2) స్ట్రెప్టోమైసిన్‌      
3) అమికాసిన్‌     4) 1, 2

43. కిందివాటిలో బేకరీ ఈస్ట్‌గా దేన్ని పిలుస్తారు?

1) రైజోపస్‌       2) కాండిడా యుటాలిస్‌    
3) శాఖరోమైసిస్‌       4) 1, 3

44. విత్తనాలు నగ్నంగా ఏర్పడే మొక్కలు-

1) ఆవృత బీజాలు     2) వివృత బీజాలు    
3) ద్విదళ బీజాలు     4) ఏకదళ బీజాలు

45. కిందివాటిలో సజీవ శిలాజం-

1) సిక్వియా     2) క్యూప్రస్‌    
3) సైకస్‌     4) గింకోబైలోబా

46. క్యాన్సర్‌ నిరోధకంగా ఉపయోగించే మొక్క?

1) టాక్సస్‌       2) సైకస్‌    
3) టాక్సస్‌ బకటా     4) గింకో

47. కిందివాటిలో ఏ టెరిటోఫైటా మొక్కను జీవ ఎరువుగా ఉపయోగిస్తారు?

1) ఈక్విజిటం   2) ఫెర్న్‌    
3) నాస్టాక్‌     4) అజొల్లా

సమాధానాలు

1-4; 2-3; 3-2; 4-4; 5-1; 6-4; 7-4; 8-1; 9-3; 10-4; 11-1; 12-2; 13-4; 14-1; 15-4; 16-1; 17-4; 18-2; 19-2; 20-1; 21-4; 22-2; 23-2; 24-3; 25-2; 26-1; 27-3; 28-1; 29-3; 30-4; 31-2; 32-1; 33-3; 34-1; 35-4; 36-1; 37-2; 38-4; 39-1; 40-4; 41-3; 42-1; 43-3; 44-2; 45-4; 46-1; 47-4.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని