కరెంట్‌ అఫైర్స్‌

అయోధ్య రామమందిరం ఆర్కిటెక్ట్‌గా ఏ కుటుంబం వ్యవహరిస్తోంది? (ప్రఖ్యాత సోమనాథ్‌ ఆలయానికి కూడా వాస్తు శిల్పిగా పనిచేసిన ఈ కుటుంబం 15 తరాలుగా ఇదే పనిలో ఉంది. అయోధ్య రామాలయం కోసం చంద్రకాంత్‌ సోమ్‌పురా చీఫ్‌ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

Published : 22 Feb 2024 02:14 IST

మాదిరి ప్రశ్నలు

  • అయోధ్య రామమందిరం ఆర్కిటెక్ట్‌గా ఏ కుటుంబం వ్యవహరిస్తోంది? (ప్రఖ్యాత సోమనాథ్‌ ఆలయానికి కూడా వాస్తు శిల్పిగా పనిచేసిన ఈ కుటుంబం 15 తరాలుగా ఇదే పనిలో ఉంది. అయోధ్య రామాలయం కోసం చంద్రకాంత్‌ సోమ్‌పురా చీఫ్‌ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన విఖ్యాత అక్షరధామ్‌ను రూపొందించారు. ఈయన ఇద్దరు కుమారులు నిఖిల్‌ సోమ్‌పురా, ఆశిష్‌ సోమ్‌పురాలు ఆర్కిటెక్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆలయానికి ప్రధాని మోదీ 2020, ఆగస్టు 5న భూమి పూజ చేశారు. ఎల్‌ అండ్‌ టీ నిర్మాణ సంస్థ కాగా, పనుల పర్యవేక్షణ బాధ్యత టాటా కన్సల్టింగ్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చూస్తోంది. రూ.1300 కోట్లతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్ట్‌ కావడంతో ఆలయాన్ని మూడు విడతల్లో పూర్తి చేయనున్నారు.)  

జ: సోమ్‌పురా కుటుంబం

  • భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల యూకే పర్యటన సందర్భంగా ఏ రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి? (భారత రక్షణమంత్రి 22 ఏళ్ల తర్వాత యూకేలో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి.)

జ: రక్షణ, శాస్త్రసాంకేతిక రంగాలు. (వీటిలో భారత్‌కు చెందిన డీఆర్‌డీవో, యూకేకు చెందిన డీఎస్‌టీఎల్‌ (డిఫెన్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ల్యాబొరేటరీ) మధ్య రక్షణరంగంలో తర్వాత తరం సాంకేతికతలపై సంయుక్త పరిశోధనలు  జరిపేందుకు కుదిరిన ఒప్పందం ముఖ్యమైంది.)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని