కరెంట్‌అఫైర్స్‌

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2024 గెలుచుకున్న తెలుగు బాల, బాలికలు ఎవరు? (2024, జనవరి 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 19 మందికి ఈ పురస్కారాలను దిల్లీలో ప్రదానం చేశారు.

Published : 23 Feb 2024 00:03 IST

మాదిరి ప్రశ్నలు

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2024 గెలుచుకున్న తెలుగు బాల, బాలికలు ఎవరు? (2024, జనవరి 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 19 మందికి ఈ పురస్కారాలను దిల్లీలో ప్రదానం చేశారు. ఏటా భారత ప్రభుత్వం 5 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల (పీఎంఆర్‌బీపీ)ను ప్రదానం చేయడం ద్వారా వారి అసాధారణ విజయాలను గుర్తిస్తోంది. ఈ ఏడాది 19 పురస్కార గ్రహీతల్లో శౌర్యం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ విభాగాల్లో ఒక్కొక్కరూ, సామాజిక సేవ విభాగంలో నలుగురు, క్రీడల విభాగంలో ఐదుగురు; కళ, సంస్కృతి కేటగిరీలో ఏడుగురు ఉన్నారు.)

జ: ఆర్‌.సూర్య ప్రసాద్‌ (క్రీడలు - ఆంధ్రప్రదేశ్‌), పెండ్యాల లక్ష్మీప్రియ (కళ, సంస్కృతి - తెలంగాణ)


అయోధ్య భవ్య మందిరంలో కొలువుదీరిన బాలరాముడి (రామ్‌లల్లా) విగ్రహం ఎత్తు ఎంత? (మైసూర్‌కు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ ఈ విగ్రహాన్ని రూపొందించారు. మైసూరుకు సమీపంలో హెచ్‌డీ కోటె దగ్గర లభ్యమైన అత్యంత నాణ్యతతో కూడిన 250 కోట్ల ఏళ్లనాటి కృష్ణశిలతో ఈ విగ్రహాన్ని రూపొందించారు)    

జ: 51 అంగుళాలు


ప్రధాని మోదీ ఇటీవల ఏ తొమ్మిది అభ్యర్థనల సాకారానికి భారతీయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు?

జ: 1. నీటి పొదుపు 2. డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహం 3. పరిశుభ్రత 4. భారత్‌లో తయారైన ఉత్పత్తులకు ఊతమివ్వడం 5. దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం 6. ప్రకృతి సేద్యం 7. చిరుధాన్యాల  వినియోగం 8. దేహదారుఢ్యంపై జాగ్రత్త వహించడం 9. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని