‘మన జనాభా లెక్కలే మన భవిష్యత్తు!’

జనాభా దేశ ప్రగతిని నిర్దేశిస్తుంది, శాసిస్తుంది. అందుకే నిర్ణీత కాలవ్యవధుల్లో జనాభాను లెక్కగట్టి నమోదు చేస్తారు. ప్రణాళికలు, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు అవసరమైన సమాచారాన్ని ఆ లెక్కలు అందిస్తాయి.

Published : 23 Feb 2024 00:18 IST

జనరల్‌ స్టడీస్‌ ఇండియన్‌ జాగ్రఫీ

 

జనాభా దేశ ప్రగతిని నిర్దేశిస్తుంది, శాసిస్తుంది. అందుకే నిర్ణీత కాలవ్యవధుల్లో జనాభాను లెక్కగట్టి నమోదు చేస్తారు. ప్రణాళికలు, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు అవసరమైన సమాచారాన్ని ఆ లెక్కలు అందిస్తాయి. వాటి ఆధారంగా ప్రాంతాల వారీగా జనాభా వ్యాప్తి, అభివృద్ధి, అక్షరాస్యత, ఉపాధి, ఉద్యోగిత లాంటి సామాజిక, ఆర్థిక సూచికలను అర్థం చేసుకోవచ్చు.  దేశ పురోగతికి దోహదపడే పథకాలను సిద్ధం చేయవచ్చు. వనరుల సక్రమ పంపిణీ, వినియోగాల కోసం చర్యలు చేపట్టవచ్చు. పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, విద్య లాంటి జాతీయస్థాయి లక్ష్యాలను సాధించవచ్చు. ఈ అంశాల నేపథ్యంలో అభ్యర్థులు జాగ్రఫీ అధ్యయనంలో భాగంగా జనాభా లెక్కల వివరాలను పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.  

భారతదేశం - జనాభా

1. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

1) జులై - 11 2) జూన్‌ - 11
3) మార్చి - 11 4) మే - 11

2. 2011 జనాభా లెక్కలు ఎన్నో జనాభా లెక్కలు?

1) 14వ   2) 15వ  3) 17వ   4) 13వ

3. 2011 జనాభా లెక్కల రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎవరు?

1) సి.చంద్రశేఖర్‌ 2) సి.చందూ కుమార్‌
3) సి.చంద్రమౌళి 4) సి.రాజశేఖర్‌

4. మన దేశంలో మొదటిసారి జనాభా లెక్కల సేకరణ జరిగిన సంవత్సరం-

1) 1891  2) 1892  3) 1872  4) 1882

5. 2011 జనాభా లెక్కల కోసం ఖర్చు చేసిన మొత్తం సరాసరి ఎంత?

1) రూ.3200 కోట్లు 2) రూ.2200 కోట్లు
3) రూ.2900 కోట్లు 4) రూ.3100 కోట్లు

6. 2011 జనాభా లెక్కల్లో సగటున ఒక్కొక్క వ్యక్తికి అయిన ఖర్చు?

1) రూ.5   2) రూ.3  
3) 10 పైసలు   4) రూ.18.19 పైసలు

7. 2011 జనాభా లెక్కలు స్వాతంత్య్రానంతరం జరిగిన ఎన్నో జనాభా లెక్కలు?

1) 13     2) 9     3) 7     4) 5

8. 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి?

1) Our census our life  
2) Our census our target life
3) our census our future 
4) Our life our census

9. స్వాతంత్య్రానంతరం జనాభా లెక్కలు మొదటిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు?

1) 1951  2) 1961  3) 1949  4) 1950

10. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా అధికంగా ఉన్న మూడో రాష్ట్రం ఏది?

1) ఉత్తర్‌ప్రదేశ్‌ 2) మధ్యప్రదేశ్‌  
3) బిహార్‌     4) మహారాష్ట్ర

11. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం ఏది?

1) గోవా   2) సిక్కిం  
3) త్రిపుర  4) మేఘాలయ

12. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా ఉన్న రెండో కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) దిల్లీ   2) చండీగఢ్‌
3) పుదుచ్చేరి   4) లక్షద్వీప్‌

13. అతి తక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం (2011 జనాభా లెక్కల ప్రకారం)

1) పుదుచ్చేరి 2) చండీగఢ్‌
3) లక్ష దీవులు 4) లద్దాఖ్‌

14. 2011 లో జనాభా వృద్ధి రేటు ఎంత?

1) 21.54%   2) 16.17%  
3) 14.73%   4) 17.7%

15. 2001, 2011 మధ్య వార్షిక వృద్ధి రేటు ఎంత?

1) 1.84%   2) 1.64%
3) 1.74%   4) 1.94%

16. అధిక జనాభా వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం ఏది? (2011 ప్రకారం)

1) త్రిపుర 2) బిహార్‌
3) మేఘాలయ   4) అస్సాం

17. అత్యల్ప జనాభా వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం?

1) మేఘాలయ   2) నాగాలాండ్‌  
3) బిహార్‌   4) కేరళ

18. అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏది? (2011 ప్రకారం)

1) బిహార్‌ 2) ఉత్తర్‌ప్రదేశ్‌
3) కేరళ   4) కర్ణాటక

19. 2011 ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత?

1) 389    2) 384   3) 382   4) 380

20. 2001 ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత?

1) 384   2) 320   3) 340   4) 325

21. 1951 నాటికి భారతదేశ జనసాంద్రత ఎంత?

1) 103   2) 107   3) 117   4) 142

22. అరుణాచల్‌ప్రదేశ్‌ జనసాంద్రత ఎంత?

1) 14    2) 17    3) 19    4) 16

23. 2011 ప్రకారం బిహార్‌ జనసాంద్రత ఎంత?

1) 1107  2) 1109  3) 1108  4) 1106

24. 2001 ప్రకారం అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏది?

1) బిహార్‌ 2) పశ్చిమ బెంగాల్‌
3) కేరళ   4) కర్ణాటక

25. అధిక జనసాంద్రత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) దిల్లీ   2) చండీగఢ్‌  
3) పుదుచ్చేరి   4) లక్ష దీవులు

26. అత్యల్ప జనసాంద్రత ఉన్న జిల్లా ఏది?

1) చెన్నై 2) దిబాంగ్‌ వ్యాలీ
3) సాంబా   4) యానాం

27. 2001 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ, పురుష నిష్పత్తి ఎంత?

1) 943    2) 933   3) 923   4) 913

28. అధిక స్త్రీ, పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం ఏది? (2011 ప్రకారం)

1) కేరళ     2) తమిళనాడు  
3) ఆంధ్రప్రదేశ్‌   4) తెలంగాణ

29. అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి ఉన్న జిల్లా ఏది?

1) యానాం   2) మహే    
3) లేహ్‌     4) అల్మోరా

30. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా ఎంత?

1) 20.14 కోట్లు     2) 16.45 కోట్లు    
3) 17.05 కోట్లు     4) 22.14 కోట్లు

31. బాలబాలికల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? (2011 జనాభా ప్రకారం)

1) బిహార్‌     2) ఉత్తర్‌ప్రదేశ్‌  
3) కర్ణాటక     4) కేరళ

32. బాలబాలికల జనాభా తక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) లక్ష దీవులు   2) దిల్లీ  
3) చండీగఢ్‌     4) లద్దాఖ్‌

33. పిల్లల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?

1) అస్సాం   2) అరుణాచల్‌ప్రదేశ్‌
3) కేరళ   4) మిజోరాం

34. పిల్లల్లో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?

1) పంజాబ్‌     2) హరియాణా  
3) కేరళ        4) కర్ణాటక

35. 2011 ప్రకారం మన దేశంలో అక్షరాస్యత ఎంత?

1) 78.48%   2) 80.40%  
3) 72.98%    4) 64.8%

36. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుష అక్షరాస్యత శాతం?

1) 64.9%   2) 80.9%  
3) 79.9%   4) 85.9%

37. అత్యధిక అక్షరాస్యత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం?

1) లక్ష దీవులు  2) లద్దాఖ్‌    
3) చండీగఢ్‌   4) దిల్లీ

38. అక్షరాస్యత తక్కువ ఉన్న రాష్ట్రం ఏది? (2011 ప్రకారం)

1) కేరళ      2) బిహార్‌  
3) కర్ణాటక   4) అస్సాం

39. అక్షరాస్యత అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది?

1) కేరళ     2) మిజోరాం    
3) గోవా     4) త్రిపుర

40. పట్టణ అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?

1) మిజోరాం     2) కేరళ  
3) తమిళనాడు   4) కర్ణాటక

41. స్త్రీలలో అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం?

1) కేరళ     2) మిజోరాం  
3) బిహార్‌   4) మహారాష్ట్ర  

42. 2011 ప్రకారం ఎస్సీల్లో అక్షరాస్యత ఎంత?

1) 74%   2) 64%  
3) 66%   4) 76%

43. 2011 ప్రకారం బౌద్ధుల్లో అక్షరాస్యత ఎంత?

1) 72.7%     2) 74.7%  
3) 78.7%    4) 80.7%

44. బౌద్ధులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?

1) మధ్యప్రదేశ్‌   2) మహారాష్ట్ర    
3) కేరళ        4) బిహార్‌

45. ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?

1) బిహార్‌   2) తమిళనాడు  
3) ఉత్తర్‌ప్రదేశ్‌   4) గోవా

46. హిందూ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం?

1) ఉత్తరాఖండ్‌     2) మిజోరాం  
3) ఉత్తర్‌ప్రదేశ్‌     4) హిమాచల్‌ప్రదేశ్‌

47. హిందూ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం?

1) బిహార్‌      2) అస్సాం    
3) మిజోరాం   4) త్రిపుర

48. జైనులు అధికంగా ఉన్న రాష్ట్రం?

1) మధ్యప్రదేశ్‌  2) మహారాష్ట్ర    
3) గోవా       4) గుజరాత్‌

49. 2011 ప్రకారం మొత్తం జనాభాలో క్రైస్తవుల శాతం ఎంత?

1) 14.7%     2) 2.3%    
3) 2.9%      4) 3.9%

50. 2011 ప్రకారం మొత్తం జనాభాలో ముస్లింలు ఎంత శాతం?

1) 14.23%     2) 17.4%    
3) 20.14%     4) 18%

సమాధానాలు

1-2; 2-2; 3-3; 4-3; 5-2; 6-4; 7-3; 8-3; 9-1; 10-3; 11-2; 12-3; 13-3; 14-4; 15-2; 16-3; 17-2; 18-1; 19-3; 20-4; 21-3; 22-2; 23-4; 24-2; 25-1; 26-2; 27-2; 28-1;29-2; 30-2; 31-2; 32-1; 33-2; 34-2; 35-3; 36-2; 37-1; 38-2; 39-2; 40-1; 41-1; 42-3; 43-1; 44-2; 45-3; 46-4; 47-3;  48-2; 49-2; 50-1.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని