కరెంట్‌ అఫైర్స్‌

2024కి ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారాలకు నామినేట్‌ అయిన భారతీయ డాక్యుమెంటరీ ఏది?

Published : 24 Feb 2024 01:01 IST

మాదిరి ప్రశ్నలు

  • 2024కి ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారాలకు నామినేట్‌ అయిన భారతీయ డాక్యుమెంటరీ ఏది? (ఆరేళ్ల క్రితం ఝార్ఖండ్‌లోని ఒక గ్రామంలో 13 ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఆ అమ్మాయి, ఆమె తండ్రి న్యాయపోరాటానికి సంకల్పించారు. అక్కడి నుంచి ఆ గ్రామస్థులు తండ్రి, కూతుళ్లపై ఎలాంటి ఒత్తిడి తెచ్చారు? న్యాయం కోసం ఆ తండ్రి, కూతుళ్లు ఎలా నిలబడ్డారు? అని ఈ డాక్యుమెంటరీ వివరిస్తుంది. నిషా పహుజా దర్శకత్వం వహించారు. 2023లో మనదేశం నుంచి ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ డాక్యుమెంటరీ ఆస్కార్‌ అవార్డు పొందింది.)

జ: టు కిల్‌ ఏ టైగర్‌

  • 2023, డిసెంబరులో వెలువడిన ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌’ నివేదిక ప్రకారం, ఏ దేశం ప్రపంచంలో అత్యధిక నల్లమందు ఉత్పత్తిదారుగా అవతరించింది?

జ: మయన్మార్‌

  • సైనికుల సంఖ్య, ఆయుధ శక్తి, ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక ప్రాముఖ్యం, వనరుల లభ్యత పరంగా భారత్‌ ప్రపంచంలో ఎన్నో స్థానాన్ని ఆక్రమిస్తోందని 2023 గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌ వెల్లడించింది? (145 దేశాల సైనిక బలాబలాలను పరిశీలించాక ఇండెక్స్‌ భారత్‌కు ఈ ర్యాంకును ఇచ్చింది.)

జ: నాలుగో స్థానం

  • ప్రాచీన, అధునాతన యుద్ధ రీతులను మేళవించేందుకు ఇటీవల భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం ఏది? (ప్రాచీన గ్రంథాల్లో వర్ణించిన పోరు పద్ధతులను, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు, చోళులు, ఇతర రాజ్యాలు అనుసరించిన యుద్ధ వ్యూహాలను అధ్యయనం చేసి, ఆధునిక కాలానికి అన్వయించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.)

జ: ఆపరేషన్‌ ఉద్భవ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని