నోటిఫికేషన్స్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీలలో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది.

Updated : 24 Feb 2024 03:43 IST

అడ్మిషన్స్‌
ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీలలో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది.

కోర్సులు అందించే సంస్థలు/ విశ్వవిద్యాలయాలు: ప్రభుత్వ/ ఎయిడెడ్‌/ అన్‌ఎయిడెడ్‌ పాలిటెక్నిక్స్‌/ ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిప్లొమా.
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. మార్చి-2024లో జరిగే పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము: ఓసీ/ బీసీ అభ్యర్థులకు రూ.400; ఎస్సీ/ ఎస్టీలకు రూ.100.
పరీక్ష కేంద్రాలు: అన్ని జిల్లాల్లోని 65 పట్టణాలు/ నగరాల్లోని దాదాపు 500 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం చివరి తేదీ: 05-04-2024.
పరీక్ష నిర్వహణ తేదీ: 27-04-2024.
ఫలితాల ప్రకటన: 13-05-2024.
వెబ్‌సైట్‌:https://polycetap.nic.in/Default.aspx


వాక్‌ - ఇన్స్‌

ఐఐఎంఆర్‌, రాజేంద్రనగర్‌లో ప్రాజెక్ట్‌ పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌- తాత్కాలిక ప్రాతిపదికన కింది ప్రాజెక్టు పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 31.
1. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌)
2. యంగ్‌ ప్రొఫెషనల్‌ (వైపీ)-I  3. యంగ్‌ ప్రొఫెషనల్‌-II
విభాగాలు: ఎక్స్‌టెన్షన్‌, బయో-కెమిస్ట్రీ, పాథాలజీ, ఫిజియాలజీ, ఎంటమాలజీ, ఎకనామిక్స్‌ లేదా అగ్రి-బిజినెస్‌, సోషల్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, జెనోమిక్స్‌ అండ్‌ ఫంక్షనల్‌ జెనోమిక్స్‌, మాలిక్యులర్‌ బ్రీడింగ్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌, జెనోమిక్స్‌, ఫంక్షనల్‌ జెనోమిక్స్‌ అండ్‌ మాలిక్యులర్‌ బ్రీడింగ్‌, జీన్‌ ఎడిటింగ్‌, సీడ్‌ టెక్నాలజీ, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ/ నెట్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టుకు పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 మించకూడదు. వైపీ పోస్టుకు 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌:globalcoemillets@millets.res.in
అప్లికేషన్‌ చివరి తేది: 05-03-2024.
ఇంటర్వ్యూ విధానం: ఫిజికల్‌/ వర్చువల్‌.
ఇంటర్వ్యూ తేదీలు: 11, 12, 15-03-2024.
ప్రదేశం: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌:https://www.millets.res.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని