ప్రాక్టీస్‌ బిట్లు

కింది వాక్యాలను పరిశీలించి సరైనవి గుర్తించండి.

Updated : 25 Feb 2024 00:54 IST

భారతదేశ చరిత్ర

1. కింది వాక్యాలను పరిశీలించి సరైనవి గుర్తించండి.

1) ద్వైతం - జీవుడు వేరు, దేవుడు వేరు
2) విశిష్టాద్వైతం - జీవుడు దేవుడిలోని అంశ
3) అద్వైతం - జీవుడే దేవుడు  4) పైవన్నీ

2. కిందివాటిలో భిన్నమైంది గుర్తించండి.

1) మధ్వాచార్యులు   2) శంకరాచార్య    
3) విష్ణుమూర్తి     4) రామానుజాచార్య

3. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవం. బ్రహ్మ ఆత్మ, పదార్థాలనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి - మధ్వాచార్య
బి) భగవాన్‌ శ్రీ కృష్ణుడి మీద అపారమైన భక్తి ఉంది-వల్లభాచార్య
సి) ‘శ్రీ భాష్యం’ పేరుతో బ్రహ్మసూత్రాలు - రామానుజాచార్యులు
డి) మానవులంతా సమానమే, కులం లేదు ఉపకులం లేదు.

1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి  
3) బి, సి, డి   4) ఎ, బి, డి

4. చైతన్య మహాప్రభుకి సంబంధించి సరైనవి?

ఎ) ఇతడిని ‘శ్రీ గౌరంగ’ అని అంటారు
బి) భారతదేశంలో అనేక ప్రాంతాలు సందర్శించారు
సి) ‘దేవుడు ఒక్కడే’ - ఆయన హరి
డి) ‘హరేకృష్ణ మంత్రం’ ప్రచారం చేశారు

 1) ఎ, బి, సి, డి  2) బి, సి, డి
3) సి, డి       4) ఎ, డి

5. సూఫీయిజం లక్షణం కానిది.

1) దేవుడు ఒక్కడే అందరూ దేవుడి సంతానమే.
2) సాటి మానవుడిని ప్రేమించడం అంటే భగవంతుడిని ప్రేమించడం
3) వహదాత్‌ - ఉల్‌ - ఆజాద్‌ అంటే బహు దేవతారాధన
4) సంగీతం ద్వారా దేవుడి సన్నిధికి చేరవచ్చు

సమాధానాలు: 1-4; 2-3; 3-2; 4-1; 5-3.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని