నోటిఫికేషన్స్‌

ముంబయిలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ (రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డివిజన్‌) సెంట్రల్‌ ఆఫీస్‌ దేశవ్యాప్తంగా రీజియన్లవారీగా సీబీ శాఖల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 25 Feb 2024 04:01 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అప్రెంటిస్‌ ఖాళీలు

ముంబయిలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ (రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డివిజన్‌) సెంట్రల్‌ ఆఫీస్‌ దేశవ్యాప్తంగా రీజియన్లవారీగా సీబీ శాఖల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 3000

  • ఆంధ్రప్రదేశ్‌లో 100 ఖాళీలు (గుంటూరు- 40, విజయవాడ- 30, విశాఖపట్నం- 30).
  • తెలంగాణలో 96 ఖాళీలు (హైదరాబాద్‌- 58, వరంగల్‌- 38)

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.03.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్‌: నెలకు రూరల్‌/ సెమీ అర్బన్‌ శాఖలు రూ.15,000. పట్టణ శాఖలు రూ.15,000. మెట్రో శాఖలు రూ.15,000.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌/ మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400).
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 06-03-2024.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 10-03-2024.
వెబ్‌సైట్‌:https://www.centralbankofindia.co.in/en


అడ్మిషన్స్‌

తెలంగాణ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీలలో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది.

కోర్సులు అందించే సంస్థలు/ విశ్వవిద్యాలయాలు: ప్రభుత్వ/ ఎయిడెడ్‌/ అన్‌ఎయిడెడ్‌ పాలిటెక్నిక్స్‌/ ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిప్లొమా. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్‌ డిప్లొమా. శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం హార్టీకల్చర్‌ డిప్లొమా. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ, ఫిషరీస్‌ డిప్లొమా.
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
పరీక్ష ఫీజు: రూ.500, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.250.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం చివరి తేదీ: 22-04-2024.
ఆలస్య రుసుము రూ.100తో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: 24-04-2024.
ఆలస్య రుసుము రూ.300తో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: 26-04-2024.
పరీక్ష నిర్వహణ తేదీ: 17-05-2024.
వెబ్‌సైట్‌: https://polycet./~btet.telangana.gov.in/#!/index

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని