కరెంట్‌ అఫైర్స్‌

సూర్యుడిపై సౌరజ్వాలలు, కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ లాంటి విషయాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన సోలార్‌ అబ్జర్వేటరీ వ్యోమనౌక ఆదిత్య ఎల్‌-1 ఏ రోజున తన తుది కక్ష్యలోకి చేరుకుంది?

Updated : 27 Feb 2024 03:33 IST

మాదిరి ప్రశ్నలు

  • సూర్యుడిపై సౌరజ్వాలలు, కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ లాంటి విషయాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన సోలార్‌ అబ్జర్వేటరీ వ్యోమనౌక ఆదిత్య ఎల్‌-1 ఏ రోజున తన తుది కక్ష్యలోకి చేరుకుంది? (భూమి నుంచి సూర్యుడి వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్య (ఎల్‌ 1 పాయింట్‌)లోకి వ్యోమ నౌక చేరుకుంది. భూమికి, సూర్యుడికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లు కాగా, అందులో ఒక శాతం అంటే 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని లగ్రాంజ్‌ పాయింట్‌ (ఎల్‌ 1)గా గణిస్తున్నారు. ఈ పాయింట్‌ ఉన్న హాలో కక్ష్యలో వ్యోమనౌక ఉంటే సూర్య గ్రహణం వంటి సందర్భాల్లోనూ నిరంతరంగా శూన్యంలో అంతరిక్ష వాతావరణంలో సూర్య సంబంధ శోధన చేసే అవకాశం ఉంటుంది)

జ: 2024, జనవరి 6


  • బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా షేక్‌ హసీనా వరుసగా ఎన్నో సారి 2024, జనవరి 11న బాధ్యతలు చేపట్టారు? (మొత్తం మీద ఈమె ఈ పదవి చేపట్టడం ఇది అయిదోసారి. తాజాగా బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో అధికార అవామి లీగ్‌ ఘనవిజయం సాధించింది. మొత్తం 300 పార్లమెంట్‌ స్థానాలకు గానూ 299 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, అవామి లీగ్‌ ఏకంగా 223 స్థానాలు సొంతం చేసుకుంది. షేక్‌ హసీనా గోపాల్‌ గంజ్‌ - 3 నియోజక వర్గం నుంచి గెలుపొందారు. బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌కు ఈమె ఎనిమిదో సారి ఎన్నికవడం విశేషం.)

జ: నాలుగో సారి


  • 2024 జనవరిలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఎన్నో వైబ్రంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సదస్సు నిర్వహించారు? (ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.)

జ: పదో సదస్సు


  • 2024, జనవరి 12న 27వ నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ నగరంలోని తపోవన్‌ మైదానంలో ప్రారంభించారు? (దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ 1930, మార్చి 2న ఇదే మందిరంలో అంబేడ్కర్‌ తన అనుచరులతో కలిసి నిరసన చేపట్టారు.)

జ: నాసిక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని