కరెంట్‌ అఫైర్స్‌

2023 సంవత్సరానికి ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాన్ని’ ఎవరు గెలుచుకున్నారు?

Updated : 28 Feb 2024 05:25 IST

మాదిరి ప్రశ్నలు

  • 2023 సంవత్సరానికి ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాన్ని’ ఎవరు గెలుచుకున్నారు?

జ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌

  • 2024 జనవరిలో తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి తైవాన్‌ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? (చైనాను తీవ్రంగా వ్యతిరేకించే అధికార డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (డీపీపీ) వరుసగా మూడోసారి విజయం సాధించింది. తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఓ పార్టీ వరుసగా మూడుసార్లు నెగ్గడం ఇదే తొలిసారి.)

జ: లైచింగ్‌ టె

  • శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసి ఖండాంతరాల్లో భారతీయ సంగీత కీర్తిని సమున్నత శిఖరాలకు చేర్చిన ప్రఖ్యాత గాయని డాక్టర్‌ ప్రభా ఆత్రే (92) 2024, జనవరి 13న ఎక్కడ మరణించారు? (హిందూస్థానీ సంగీతంలో కిరానా ఘరానాకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంలో ఈమె కీలకపాత్ర పోషించారు. సంగీత వాగ్గేయకారిణిగానే కాకుండా విద్యావేత్త, పరిశోధకురాలు, సంగీత దర్శకురాలు, రచయిత్రిగా పేరు సంపాదించారు. ‘ఎలాంగ్‌ ది పాథ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ అనే స్వీయచరిత్ర పుస్తకం రచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1990లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్‌, 2022లో పద్మవిభూషణ్‌ పురస్కారాలను అందుకున్నారు.)

జ: పుణె




ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024, ఫిబ్రవరి 26న దిల్లీలోని భారత్‌ మండపంలో ‘భారత్‌ టెక్స్‌-2024’ను ప్రారంభించారు. ప్రపంచం నుంచి వచ్చే ఫ్యాషన్లపై ఆధారపడకుండా భారతీయ జౌళి, వస్త్ర రంగమే ఇతర దేశాలకు కొత్త ఫ్యాషన్లు పరిచయం చేసే స్థాయికి ఎదగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 29 వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది.


కేంద్ర గణాంకాల శాఖ 2022 ఆగస్టు నుంచి 2023 జులై మధ్య గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కుటుంబ నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ)పై సర్వే నిర్వహించింది. దాన్ని కుటుంబ వినియోగ వ్యయ సర్వే-2023 పేరుతో విడుదల చేసింది. దీనిప్రకారం, గ్రామీణ కుటుంబాల నెలవారీ వ్యయంలో సిక్కిం రూ.7,731తో మొదటి స్థానంలో, ఛత్తీస్‌గఢ్‌ రూ.2466తో చివరి స్థానంలో ఉన్నాయి. పట్టణ కుటుంబాల నెలవారీ వ్యయంలో చండీగఢ్‌ రూ.12,575తో మొదటి స్థానంలో ఉంది.

  • పట్టణ ప్రాంతంలో నెలవారీగా కుటుంబాలు చేసే తలసరి వ్యయానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలవగా, ఏపీ చివరి స్థానానికి పరిమితమైంది. తెలంగాణ పట్టణాల్లో నెలకు రూ.8,158, కర్ణాటక రూ.7,666, తమిళనాడు రూ.7,630, కేరళ రూ.7,078, ఏపీలో రూ.6,782 ఖర్చు చేస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో కేరళలో రూ.5,924, తమిళనాడు రూ.5,310, ఏపీ రూ.4,870, తెలంగాణ రూ.4,802, కర్ణాటకలో రూ.4,397 వెచ్చిస్తున్నారు. కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని