కరెంట్‌ అఫైర్స్‌

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కర్తవ్య పథ్‌లో 2024, జనవరి 26న ప్రదర్శించిన శకటాల్లో ఏ రాష్ట్ర శకటానికి న్యాయ నిర్ణేతల విభాగంలో మొదటి స్థానం లభించింది? (ఈ విభాగంలో గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Updated : 29 Feb 2024 03:30 IST

మాదిరి ప్రశ్నలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కర్తవ్య పథ్‌లో 2024, జనవరి 26న ప్రదర్శించిన శకటాల్లో ఏ రాష్ట్ర శకటానికి న్యాయ నిర్ణేతల విభాగంలో మొదటి స్థానం లభించింది? (ఈ విభాగంలో గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రజా ఎంపిక విభాగంలో గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మహిళా సాధికారత, రాష్ట్రంలో వినూతికెక్కిన హస్తకళ, చేనేత రంగాన్ని న్యాయ నిర్ణేతల విభాగంలో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్ర శకటం ప్రదర్శించింది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ‘భారత్‌ ప్రజాస్వామ్యానికి తల్లి’ అనే నేపథ్యంలో రూపొందించిన సాంస్కృతిక శాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది.)

జ: ఒడిశా

2024, జనవరి 31న బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి పార్లమెంటు నూతన భవనం లోక్‌సభ ఛాంబర్‌లో ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ నాలుగు బలమైన స్తంభాలపై వికసిత భారత్‌ పరిఢవిల్లుతుందని పేర్కొన్నారు?

జ: యువత, మహిళలు, రైతులు, పేదలు

దేశంలో అత్యంత పొడవైన సముద్ర వారధి ‘అటల్‌ బిహారీ వాజ్‌పేయీ సెవ్రీ - నవా షివా అటల్‌ సేతు’ను 2024, జనవరి 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని పొడవు ఎంత? (ఆరు లైన్ల ఈ బ్రిడ్జినే ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ (ఎంటీహెచ్‌ఎల్‌) గా కూడా పిలుస్తారు. ఇది దక్షిణ ముంబయి - నవీ ముంబయిని అనుసంధానిస్తుంది.)

జ: 21.8 కిలోమీటర్లు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో జాతీయ కస్టమ్స్‌ పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ (నాసిన్‌ - నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌, ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌) కొత్త క్యాంపస్‌ను ప్రధాని మోదీ ఏ రోజున ప్రారంభించారు? (సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.)

జ: 2024, జనవరి 16


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని