సమాధానాన్ని ‘ఊహించి’.. మార్కులు రాబట్టి!

వివిధ పోటీపరీక్షల్లో లాజికల్‌ రీజనింగ్‌ నుంచి ప్రకటన - ఊహలు అంశంపై ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఒక ప్రకటనతో పాటు రెండు లేదా మూడు ఊహలు ఇచ్చి, వాటిలో ఏది ప్రకటనకు సరైన అర్థాన్ని ఇస్తుందో కనుక్కోమని అడుగుతారు.

Updated : 29 Feb 2024 06:25 IST

రీజనింగ్‌

వివిధ పోటీపరీక్షల్లో లాజికల్‌ రీజనింగ్‌ నుంచి ప్రకటన - ఊహలు అంశంపై ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఒక ప్రకటనతో పాటు రెండు లేదా మూడు ఊహలు ఇచ్చి, వాటిలో ఏది ప్రకటనకు సరైన అర్థాన్ని ఇస్తుందో కనుక్కోమని అడుగుతారు. సాధారణంగా ఇవి మన నిత్యజీవితంలో జరిగే అంశాలపైనే వస్తాయి. అభ్యర్థి ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి, ప్రకటన -  ఊహల
మధ్య సంబంధాన్ని గుర్తించాలి. ఏ ఊహ ఇచ్చిన ప్రకటనకు సరిపోతుందో కనిపెట్టాలి. నిరంతర సాధన, విషయ పరిజ్ఞానంతో అభ్యర్థి సులభంగా సమాధానాలు పొందొచ్చు.

ప్రకటనలు - ఊహలు (Statements - Assumptions)

సూచనలు (ప్ర. 1 - 12): కింది ప్రశ్నల్లో ఒక ప్రకటన దానికి అనుబంధంగా I, II అనే రెండు ఊహలు ఉన్నాయి.  కింది ఆప్షన్స్‌ ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
ఎ) I మాత్రమే సరైంది. బి) II మాత్రమే సరైంది.
సి) I లేదా II సరైంది. డి) I, II సరైనవి కావు.
ఇ) I, II సరైనవి.

1. ప్రకటన: ఒక పిచ్చివాడిలా నేను అతడ్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను.

ఊహలు: I. నేను పిచ్చివాడిని కాను.
    II. నేను పిచ్చివాడిని.

సాధన: ప్రకటనలో ‘పిచ్చివాడిలా’ అని ఉంది. అంటే ఆ మనిషి ఆ సమయానికి పిచ్చివాడిలా ఉన్నాడు కానీ నిజంగా పిచ్చివాడు కాదు లేదా పిచ్చివాడిలా నటించాడు అనేది తెలియజేస్తుంది. కాబట్టి I లేదా II సరైంది.

సమాధానం: సి

2. ప్రకటన: అనేక మంది చరిత్రకారులు సత్యాన్ని వక్రీకరించడం ద్వారా మంచి కంటే ఎక్కువ హాని చేస్తారు.

ఊహలు: I. చరిత్రకారులు దేన్ని నివేదిస్తే ప్రజలు దాన్ని నిజమని భావిస్తారు.
 II. చరిత్రకారులు చాలా అరుదుగా నిజాన్ని వర్ణిస్తారని ప్రజలు భావిస్తారు.

సాధన: ఇచ్చిన ఊహల్లో I సరైంది. ఎందుకంటే చరిత్రకారులు దేన్ని నివేదిస్తే ప్రజలు దాన్ని నిజమని భావిస్తారు. II ఇచ్చిన ప్రవచనాన్ని అనుసరించడం లేదు.

సమాధానం: ఎ

3. ప్రకటన: నవీన్‌తో పవన్‌ ‘‘అతిథులకు భోజనాన్ని అందించాలి’’ అని చెప్పాడు.

ఊహలు: I. చెప్పకపోతే భోజనం అందించరు.
           II. భోజన సమయంలో అతిథులు ఉంటారు.

సాధన: I, II రెండూ ఇచ్చిన ప్రవచనాన్ని అనుసరిస్తున్నాయి.

సమాధానం: ఇ

4. ప్రకటన: భారతదేశంలో జీవన వ్యయం పెరిగిపోయింది.

ఊహలు: I. ఇటీవలి కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి.
II. దేశంలో అనేక విలాసవంతమైన వస్తువులు పుష్కలంగా లభిస్తున్నాయి.

సాధన: జీవన వ్యయం నేరుగా నిత్యావసర వస్తువుల ధరలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి I సరైంది. ఊహ II జీవన వ్యయం పెరుగుదల ప్రధాన పర్యవసానాన్ని సూచిస్తుంది. కాబట్టి అది కూడా సరైందే.

సమాధానం: ఇ

5. ప్రకటన: ప్రభుత్వ సహాయం పొందిన పాఠశాలలు వివిధ ఫీజులను తగ్గించడంలో ఏకరూపతగా ఉండాలి.

ఊహలు: I. ప్రజల నుంచి పన్నుల ద్వారా సేకరించిన సొమ్ము ద్వారా ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది.
II. ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చేటప్పుడు ఫీజు విషయంలో కొన్ని ఏకరీతి షరతులను నిర్దేశించవచ్చు.

సాధన: ఊహ II ఇచ్చిన ప్రకటనను అనుసరిస్తుంది.

సమాధానం: బి

6. ప్రకటన: మన సిబ్బందిని ఇతరుల నుంచి గుర్తించడానికి నీలిరంగు టై సహాయపడుతుందని ఒక కంపెనీ పేర్కొంది.

ఊహలు: I. కంపెనీ తన సిబ్బందిని గుర్తించడం అవసరం
           II. నీలిరంగు టై ధరించడం అనేది లేటెస్ట్‌ ఫ్యాషన్‌.

సాధన: ఏ కంపెనీ అయినా తన సిబ్బందిని గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి I సరైంది. ప్రకటనలో ఆధునికత గురించి ఏమీ ప్రస్తావించలేదు. II సరైంది కాదు.

సమాధానం: ఎ

7. ప్రకటన: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత కంప్యూటర్‌ను కొనాలని ఆశిస్తారని ఒక కళాశాల విద్యార్థి పేర్కొన్నాడు.

ఊహలు: I. వ్యక్తిగత కంప్యూటర్లు అవసరం కాదు, విలాసం.
II. వ్యక్తిగత కంప్యూటర్లు వాడటం వల్ల నైపుణ్యం మెరుగవుతుంది.

సాధన: ఇచ్చిన ప్రకటన నుంచి వ్యక్తిగత కంప్యూటర్ల అవసరం లేదా వాడకం గురించి ఏమీ రాబట్టలేం. కాబటి I, II సరైనవి కావు.

సమాధానం: డి

8. ప్రకటన: భారతదేశంలోని చక్కెర పరిశ్రమల సంఖ్య పెంచినప్పటికీ మనం చక్కెరను దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం.

ఊహలు: I. భారతదేశంలో తలసరి చక్కెర వినియోగం పెరిగింది.
II. చాలా పరిశ్రమలు వాటి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసే పరిస్థితిలో లేవు.

సాధన: చక్కెర వినియోగం పెరగడం లేదా పరిశ్రమలు సరిపడేంత చక్కెరను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోవడం అనేవి మనం చక్కెరను దిగుమతి చేసుకోవడానికి కారణాలు. కాబట్టి ఊహలు I లేదా II సరైనవి.

సమాధానం: సి

9. ప్రకటన: ఎవరైతే ప్రార్థన నుంచి మెరుగైన వ్యక్తిగా ఎదుగుతారో, వారి ప్రార్థనకు విలువ ఉంటుంది.

ఊహలు: I. ప్రార్థన మనిషిని మరింత మానవత్వం ఉన్న వ్యక్తిగా మారుస్తుంది.
II. మన తప్పులన్నింటినీ ప్రార్థన పోగొడుతుంది.

సాధన: ప్రార్థన మనిషిని మరింత మానవత్వం ఉన్న వ్యక్తిగా మారుస్తుంది అని చెప్పడంలో స్పష్టత లేదు. ప్రార్థనతో మన తప్పులు తొలగుతాయి అనేది కూడా అవాస్తవం.

సమాధానం: డి

10. ప్రకటన: కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. అయితే మా కుక్కలు మొరగవు కానీ అవి అతిథులకు, చొరబాటు దారులకు మధ్య తేడాను గుర్తించేలా శిక్షణ పొందాయి.

ఊహలు: II. మొరిగే కుక్కలు అరుదుగా కరుస్తాయి.
II. చొరబాటుదారులకు మా కుక్కలు చాలా అపాయకరమైనవి.

సాధన: ఇచ్చిన ప్రకటనలో స్పష్టంగా కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఉంది. అలాగే  అతిథులను ఆహ్వానించడంలో, చొరబాటుదారులను వేరుగా గుర్తించడంలో శిక్షణ పొందాయని కూడా ప్రజలను హెచ్చరించారు. కాబట్టి II సరైంది.

సమాధానం: బి

11. ప్రకటన: కంపెనీ తి షేర్లలో హరి ఇటీవల పెట్టుబడి పెట్టడం కేవలం ఒక ఎత్తు.

ఊహలు: I. హరి పెట్టుబడిపై నష్టాన్ని ఎదుర్కోవచ్చు.
II. హరి పెట్టుబడిపై లాభాన్ని పొందొచ్చు.

సాధన: ‘ఒక ఎత్తు’ అనే పదాన్ని వాడటం వల్ల ఆ పనిలో అతడు అయితే గెలవొచ్చు లేదా ఓడిపోవచ్చు అని సూచిస్తుంది.

సమాధానం: సి

12. ప్రకటన: పాఠశాలలకు హజరయ్యే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలి.

ఊహలు: I. మధ్యాహ్న భోజన పథకం పిల్లలను పాఠశాలలకు ఆకర్షించేలా చేస్తుంది.
II. ఏ పిల్లలు అయితే మంచి ఆహారాన్ని పొందలేరో వారు పాఠశాలలకు హాజరవుతారు.

సాధన: మధ్యాహ్న భోజన పథకం అందించడం ద్వారా ఒక అదనపు సౌలభ్యంగా చాలా సంఖ్యలో పిల్లలను ఆకర్షించవచ్చు. అంతే కానీ పిల్లకు ఇంటి వద్ద మంచి భోజనం దొరకడం లేదని కాదు. I మాత్రమే సరైంది.

సమాధానం: ఎ

13. సూచనలు: కిందివాటిలో ప్రతి ప్రశ్నకు ఒక ప్రకటన; I, II, III ఊహలు ఉన్నాయి. ఇచ్చిన సమాచారం ఆధారంగా సరైనదాన్ని ఎంచుకోండి.

ప్రకటన: పట్టణాల్లోని పెద్ద షోరూంలలో ఉండే వస్తువుల ధరలు చిన్న దుకాణాల్లో ఉండే వాటి కంటే ఎక్కువగా ఉంటాయి.

ఊహలు: I. చిన్న దుకాణాల్లోని వస్తువులు ఎప్పటికీ నమ్మదగినవి కావు.
II. పెద్ద షోరూంలు నిర్వహించే వ్యక్తులు మోసం చేస్తారు.
III. పెద్ద షోరూంలను నిర్వహించడం ఒక ఖర్చుతో కూడిన పని. అందుకే వాటిలో ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి
ఎ) I మాత్రమే సరైంది బి) II మాత్రమే సరైంది
సి) II మాత్రమే సరైంది డి) ఏదీకాదు

సాధన: కేవలం ఊహ III మాత్రమే ప్రకటన సారాంశాన్ని సరిగ్గా నిర్వచిస్తోంది.

సమాధానం: సి

రచయిత బూసర గణేష్‌, విషయ నిపుణులు

ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్‌ II స్క్రీనింగ్‌ టెస్ట్‌లోని మెంటల్‌ ఎబిలిటీ - లాజికల్‌ రీజనింగ్‌ సొల్యూషన్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని