కరెంట్‌ అఫైర్స్‌

2024, జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌ - వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌) సమావేశాలు ఎన్నోవి? (‘బిల్డింగ్‌ ట్రస్ట్‌’ అనే థీమ్‌తో ఈ సమావేశాలను నిర్వహించారు.

Updated : 01 Mar 2024 04:58 IST

మాదిరి ప్రశ్నలు

2024, జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌ - వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌) సమావేశాలు ఎన్నోవి? (‘బిల్డింగ్‌ ట్రస్ట్‌’ అనే థీమ్‌తో ఈ సమావేశాలను నిర్వహించారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, అశ్వినీ వైష్ణవ్‌, హర్‌దీప్‌ సింగ్‌ పురీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఈ సమావేశాలకు హాజరయ్యారు.)

జ: 54వ


దుకాణాల్లో వస్తువులు దొంగిలించారన్న ఆరోపణలపై ఏ దేశ మహిళా ఎంపీ గోలిజ్‌ గ్రాహమన్‌ తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు? (గ్రీన్‌ పార్టీ తరఫున గెలుపొందిన ఈమె ఇరాన్‌ నుంచి వలస వచ్చి 2017లో ఈ దేశంలో ఎంపీ అయిన తొలి వలస వ్యక్తిగా రికార్డులకెక్కారు.)

జ: న్యూజిలాండ్‌


2024, జనవరి 18న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య భవ్య రామ మందిరానికి సంబంధించి ఎన్ని పోస్టల్‌ స్టాంపులను విడుదల చేశారు? (ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు శ్రీరాముడిపై జారీ చేసిన స్టాంపులతో కూడిన 48 పేజీల స్టాంపు బుక్‌ను కూడా మోదీ ఈ సందర్భంగా విడుదల చేశారు.)

జ: ఆరు (అయోధ్య రామాలయం, వినాయకుడు, హనుమంతుడు, జటాయు, శబరి మాత, కేవట్‌ రాజ్‌లపై ఈ స్టాంపులను ముద్రించారు.)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని