నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నార్‌సెట్‌)- 6 నోటిఫికేషన్‌ విడుదలైంది.  

Published : 01 Mar 2024 02:09 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
ఎయిమ్స్‌లో నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు  

న్యూదిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నార్‌సెట్‌)- 6 నోటిఫికేషన్‌ విడుదలైంది.  

నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు  

ఎయిమ్స్‌ సంస్థలు: ఎయిమ్స్‌ భటిండా, ఎయిమ్స్‌ భువనేశ్వర్‌, ఎయిమ్స్‌ బిలాస్‌పూర్‌, ఎయిమ్స్‌ దేవ్‌ఘర్‌, ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్‌, ఎయిమ్స్‌ గువాహటి, ఎయిమ్స్‌ కల్యాణి, ఎయిమ్స్‌ మంగళగిరి, ఎయిమ్స్‌ నాగ్‌పుర్‌, ఎయిమ్స్‌ రాయ్‌ బరేలీ, ఎయిమ్స్‌ న్యూదిల్లీ, ఎయిమ్స్‌ పట్నా, ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌, ఎయిమ్స్‌ విజయ్‌పూర్‌.
అర్హత: డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్‌/ బీఎస్సీ నర్సింగ్‌/ బీఎస్సీ (పోస్ట్‌ సర్టిఫికెట్‌)/ పోస్ట్‌-బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్‌/ ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.  
వయోపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.  
జీత భత్యాలు: రూ.9300- రూ.34800తో పాటు రూ.4600 గ్రేడ్‌ పే అందుతుంది.  
దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2400; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.  
ఎంపిక ప్రక్రియ: నార్‌సెట్‌-6 ప్రిలిమినరీ, ప్రధాన పరీక్షలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.  
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.03.2024.

వెబ్‌సైట్‌: https://www.aiimsexams.ac.in/ 


రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ప్రొఫెషనల్‌ పోస్టులు  

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌), రామగుండం ప్లాంట్‌ వివిధ విభాగాల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 27.  

1. అసిస్టెంట్‌ మేనేజర్‌  2. సీనియర్‌ మేనేజర్‌   3. చీఫ్‌ మేనేజర్‌  4. మేనేజర్‌   5. డిప్యూటీ మేనేజర్‌  6. అడిషనల్‌ సీఎంఓ   7. సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌  

విభాగాలు: కెమికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కెమికల్‌ ల్యాబ్‌, మెటీరియల్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌, మెడికల్‌, సేఫ్టీ.  

అర్హత: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్‌, బీఎస్సీ (ఇంజినీరింగ్‌), ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ (కెమిస్ట్రీ) పీజీ, డిప్లొమా, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-03-2024.  

దరఖాస్తు హార్డ్‌కాపీలు పోస్టులో పంపేందుకు చివరి తేదీ: 27.03.2024.

వెబ్‌సైట్‌: https://www.rfcl.co.in/ 

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని