గాలిలోని కార్బన్‌ డైఆక్సైడ్‌కు.. సముద్రాలే సింక్‌లు!

మానవులు, మొక్కలు, జంతువులపై హానికర ప్రభావాన్ని చూపిస్తూ, పరిసరాల్లో ప్రదర్శించే అవాంఛనీయ మార్పుల ప్రభావాన్ని ‘పర్యావరణ కాలుష్యం’ అంటారు. మానవ కార్యకలాపాల ఫలితంగా వాతావరణంలోకి హానికర వాయువులు చేరి పర్యావరణం కాలుష్యానికి లోనవుతోంది.

Published : 01 Mar 2024 02:19 IST

ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
కెమిస్ట్రీ

మానవులు, మొక్కలు, జంతువులపై హానికర ప్రభావాన్ని చూపిస్తూ, పరిసరాల్లో ప్రదర్శించే అవాంఛనీయ మార్పుల ప్రభావాన్ని ‘పర్యావరణ కాలుష్యం’ అంటారు. మానవ కార్యకలాపాల ఫలితంగా వాతావరణంలోకి హానికర వాయువులు చేరి పర్యావరణం కాలుష్యానికి లోనవుతోంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే ప్రాణికోటికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కాలుష్యాలు, వాటి వర్గీకరణ, కాలుష్య కారకాలు మొదలైన వాటిపై పోటీపరీక్షార్థికి అవగాహన ఉండాలి.


కాలుష్యకాలు - వర్గీకరణ

స్థితి ఆధారంగా వర్గీకరణ

పర్యావరణంలోకి ప్రవేశించే స్థితి, కాలుష్యం కలిగించే దశలో స్థితిని బట్టి కాలుష్యకాలను రెండు రకాలుగా వర్గీకరించారు.

1. ప్రాథమిక కాలుష్యకాలు 2. ద్వితీయ కాలుష్యకాలు

ప్రాథమిక కాలుష్యకాలు: ప్రాథమిక కాలుష్యకాలు పర్యావరణంలోకి ఏ స్థితిలో ప్రవేశిస్తాయో, అదే స్థితిలో పర్యావరణ కాలుష్యానికి కారణమవుతాయి.

ఉదా: నైట్రిక్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ ఆక్సైడ్‌, బూడిద, పొగ మొదలైనవి.

ద్వితీయ కాలుష్యకాలు: ప్రాథమిక కాలుష్యకాల మధ్య రసాయన చర్య ద్వారా ఏర్పడి పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే వాటిని ‘ద్వితీయ కాలుష్యకాలు’ అంటారు.
ఉదా: కాంతి రసాయన స్మాగ్‌, పెరాక్సీ ఎసిటైల్‌ నైట్రేట్‌ మొదలైనవి.

ఉనికి ఆధారంగా వర్గీకరణ

ప్రకృతిలో ఉనికి ఆధారంగా కాలుష్యకాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి: 1. పరిమాణాత్మక కాలుష్యకాలు 2. గుణాత్మక కాలుష్యకాలు.

పరిమాణాత్మక కాలుష్యకాలు: పర్యావరణంలో కొన్ని పదార్థాల గాఢతల ప్రారంభ అవధి విలువను దాటి పెరిగినప్పుడు మాత్రమే ఆ పదార్థాలు కాలుష్యకాలుగా పనిచేస్తాయి. వీటినే పరిమాణాత్మక కాలుష్యకాలు అంటారు.

ఉదా: కార్బన్‌ డైఆక్సైడ్‌, సల్ఫర్‌ డైఆక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ మొదలైనవి.

గుణాత్మక కాలుష్యకాలు: ఇవి పర్యావరణంలో సిద్ధంగా ఉండవు. అయితే మానవుడి కార్యకలాపాల ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తాయి.

ఉదా: పురుగు మందులు, కీటకనాశనులు మొదలైనవి.

క్షయీకృత స్వభావం బట్టి వర్గీకరణ

క్షయీకృత స్వభావం ఆధారంగా కాలుష్యాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి: 1. జీవక్షయీకృతం చెందే కాలుష్యకాలు 2. జీవక్షయీకృతం చెందని కాలుష్యకాలు

జీవక్షయీకృతం చెందే కాలుష్యకాలు: ఇవి సహజంగా సూక్ష్మజీవుల ద్వారా క్షయీకృతం చెందుతాయి.

ఉదా: పశు, వ్యవసాయ, మానవ సంబంధ వ్యర్థాలు, పేపర్‌, మురుగు నీరు మొదలైనవి.

జీవక్షయీకృతం చెందని కాలుష్యకాలు: ఇవి క్షయీకృతం చెందవు లేదా చాలా నెమ్మదిగా క్షయీకృతం అవుతాయి.

ఉదా: ప్లాస్టిక్‌లు, రసాయన క్రిమిసంహారకాలు, లోహ వ్యర్థాలు, రేడియోధార్మిక వ్యర్థాలు మొదలైనవి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని