నోటిఫికేషన్స్‌

మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం వివిధ విభాగాల్లో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకుగాను పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

Published : 02 Mar 2024 03:42 IST

అడ్మిషన్స్‌
ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌-2024

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కింద నిర్మితమైన స్వయంప్రతిపత్తి సంస్థ - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐసర్‌)లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను బీఎస్‌, బీఎస్‌ - ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
ఐసర్‌ క్యాంపస్‌లు: భోపాల్‌, బర్హంపూర్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి.
అందిస్తున్న కోర్సులు: బీఎస్‌, బీఎస్‌-ఎంఎస్‌ డ్యూయల్‌ డిగ్రీ. ఇవి పూర్తి రెసిడెన్షియల్‌ ఫుల్‌టైం కోర్సులు.
బీఎస్‌ డిగ్రీ: ఇంజినీరింగ్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌ విభాగాలను కేవలం భోపాల్‌ క్యాంపస్‌ మాత్రమే అందిస్తుంది. ఇది నాలుగేళ్ల కోర్సు.
బీఎస్‌-ఎంఎస్‌ డిగ్రీ: ఇది అయిదేళ్ల డిగ్రీ కోర్సు. దీనిలో బయోలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌ అండ్‌ క్లైమేట్‌ సైన్సెస్‌/ ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, ఎకనామిక్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌ సైన్సెస్‌, జియోలాజికల్‌ సైన్సెస్‌, ఇంటిగ్రేటెడ్‌ అండ్‌ ఇంటర్‌డిసిప్లినరీ సైన్సెస్‌, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌ విభాగాలు ఉన్నాయి.
సీట్ల సంఖ్య: బీఎస్‌ (ఇంజినీరింగ్‌ సైన్స్‌)- 60, బీఎస్‌ (ఎకనామిక్‌ సైన్సెస్‌)- 30, బీఎస్‌-ఎంఎస్‌ డ్యూయల్‌ డిగ్రీ- 1748.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కుల (ఎస్సీ/ ఎస్టీలకు 55 శాతం)తో ఇంటర్మీడియట్‌ (సైన్స్‌ స్ట్రీమ్‌)/ పన్నెండో తరగతి 2022/ 2023/ 2024లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 01-04-2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 13-05-2024.
ఐఏటీ నిర్వహణ తేదీ: 09-06-2024.
వెబ్‌సైట్‌https://iiseradmission.in/


పాలమూరు యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌

మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం వివిధ విభాగాల్లో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకుగాను పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌: 2022-23, 2023-24

విభాగాలు:

1. ఆర్ట్స్‌ (ఇంగ్లిష్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌)
2. సైన్స్‌ (కెమిస్ట్రీ అండ్‌ మైక్రోబయాలజీ)
3. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌
4. ఫార్మసీ
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, నెట్‌/ టీఎస్‌ సెట్‌/ ఐకార్‌ జేఆర్‌ఎఫ్‌ తదితరాల్లో ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ. 2000. (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 1000).
చిరునామా: రిజిస్ట్రార్‌ కార్యాలయం, పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్‌నగర్‌, తెలంగాణ.
దరఖాస్తు చివరి తేదీ: 23-03-2024.
వెబ్‌సైట్‌:https://www.palamuruuniversity.ac.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు