కరెంట్‌ అఫైర్స్‌

ఏ దేశంలో ఉన్న రెగ్జానెస్‌ ద్వీపకల్పంలోని గ్రిండావిక్‌ నగర సమీపంలో గల సిలింగర్‌ ఫెల్‌ అగ్ని పర్వతం బద్దలై ఇటీవల వార్తల్లో నిలిచింది?

Published : 29 Mar 2024 00:08 IST

మాదిరి ప్రశ్నలు

  • ఏ దేశంలో ఉన్న రెగ్జానెస్‌ ద్వీపకల్పంలోని గ్రిండావిక్‌ నగర సమీపంలో గల సిలింగర్‌ ఫెల్‌ అగ్ని పర్వతం బద్దలై ఇటీవల వార్తల్లో నిలిచింది?

(2023, డిసెంబరు నుంచి 2024, ఫిబ్రవరి నాటికి ఇది మూడు సార్లు బద్దలై లావా ప్రవాహాన్ని విరజిమ్మింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో చురుకైన అగ్నిపర్వతాలున్న దేశంగా దీనికి పేరుంది. అందుకే ఈ దేశాన్ని ‘ల్యాండ్‌ ఆఫ్‌ ఫైర్‌ అండ్‌ ఐస్‌’ అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ దేశ వ్యాప్తంగా 30కి పైగా అగ్నిపర్వతాలు చురుగ్గా ఉన్నాయి. ఈ దేశం మిడ్‌ అట్లాంటిక్‌ రిడ్జ్‌ ప్రాంతంలో ఉండటమే అక్కడ ఇన్ని అగ్ని పర్వతాల పుట్టుకకు ప్రధాన కారణమని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.)                

జ: ఐస్‌లాండ్‌

  • ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డుల్లో కొత్తగా ఏ  కేటగిరీ కింద అవార్డు ఇవ్వాలని ఆస్కార్‌ అకాడమీ నిర్ణయించింది?

(ప్రస్తుతం 23 విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. కొత్త ఈ విభాగంతో కలిపి ఈ సంఖ్య 24కు చేరింది. 2026లో జరిగే 98వ ఆస్కార్‌ అవార్డుల   ప్రదానోత్సవంలో ఈ విభాగంలో అవార్డును ప్రదానం చేయాలని అకాడమీ నిర్ణయించింది. చివరిసారిగా 2001లో బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగాన్ని ఆస్కార్‌ అవార్డుల్లో చేర్చారు. ఆస్కార్‌ అకాడమీ ప్రస్తుత అధ్యక్షుడు జానెట్‌ యంగ్‌.)

జ: క్యాస్టింగ్‌ డైరెక్టర్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని