గవర్నమెంట్‌ జాబ్స్‌

ఝార్ఖండ్‌లో ఉన్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), దేవ్‌ఘర్‌లో  సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Published : 29 Mar 2024 00:21 IST

ఎయిమ్స్‌ దేవ్‌ఘర్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

ఝార్ఖండ్‌లో ఉన్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), దేవ్‌ఘర్‌లో  సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 100

విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటల్‌ సర్జరీ, ఎండోక్రైనాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌ తదితరాలు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత.

గరిష్ఠ వయోపరిమితి: 45 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.67700.

దరఖాస్తు రుసుం: అన్‌రిజర్వ్‌డ్‌ - రూ.3000. ఓబీసీలకు రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్‌ ఆఫీస్‌, 4వ అంతస్తు, ఎయిమ్స్‌, దేవిపూర్‌ (అకడమిక్‌ బ్లాక్‌), దేవ్‌ఘర్‌, ఝార్ఖండ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: 31-03-2024.
వెబ్‌సైట్‌: https://www.aiimsdeoghar.edu.in/


అడ్మిషన్స్‌

ఏపీ లాసెట్‌/ పీజీఎల్‌సెట్‌-2024

ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌)/ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లాసెట్‌ (ఏపీ పీజీఎల్‌సెట్‌)-2024 నోటిఫికేఫన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించనుంది.

కోర్సులు: మూడేళ్లు/ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం/ ఎంఎల్‌.

అర్హత: కోర్సును అనుసరించి 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఎల్‌ఎల్‌బీ కోర్సుకు - ఓసీ అభ్యర్థులకు రూ.900. బీసీలకు 850. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్ధులకు రూ.800. ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు- ఓసీ అభ్యర్థులకు రూ.1000. బీసీలకు రూ.950. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.900.

పరీక్ష విధానం: అబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఎల్‌ఎల్‌బీ కోర్సులకు పరీక్ష ఇంగ్లిష్‌, తెలుగు రెండు మాధ్యమాల్లో; ఎల్‌ఎల్‌ఎం పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25 ఏప్రిల్‌ 2024

ప్రవేశ పరీక్ష తేది: 9 జూన్‌ 2024.

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx


మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని