కరెంట్‌ అఫైర్స్‌

97 ఏళ్ల వయసులో సైతం కోర్టుకు హాజరై కేసులు వాదిస్తూ గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సృష్టించిన కేరళ రాష్ట్రానికి చెందిన న్యాయవాది ఎవరు?

Updated : 30 Mar 2024 01:11 IST

మాదిరి ప్రశ్నలు

  • 97 ఏళ్ల వయసులో సైతం కోర్టుకు హాజరై కేసులు వాదిస్తూ గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సృష్టించిన కేరళ రాష్ట్రానికి చెందిన న్యాయవాది ఎవరు? (2023, సెప్టెంబరు  11 నాటికి ఈయన 73 సంవత్సరాల 60 రోజులు   న్యాయవాదిగా కొనసాగి సుదీర్ఘకాలం కెరీర్‌ ఉన్న పురుష న్యాయవాదిగా గిన్నిస్‌ రికార్డు నెలకొల్పారు.)

జ: పి.బాలసుబ్రహ్మణియన్‌ మేనన్‌


  • నకిలీ/తప్పుడు డాక్యుమెంట్లతో సిమ్‌ కార్డులు తీసుకుని వాటి ద్వారా సైబర్‌ మోసాలు, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వాటిని నియంత్రించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్ని అక్రమ సెల్‌ఫోన్‌ కనెక్షన్లను ఇటీవల రద్దు చేసింది? (సైబర్‌ నేరాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రారంభించిన ‘సంచార్‌ సాథీ’ పోర్టల్‌ ద్వారా ఈ అక్రమ సెల్‌ఫోన్‌ కనెక్షన్లను గుర్తించి చర్యలు తీసుకుంది.)

జ: 55.52 లక్షలు


  • వికసిత్‌ భారత్‌ - 2047 కింద దేశీయ ఆర్థిక వ్యవస్థను ఎంత మొత్తానికి చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విజన్‌తో ముందుకెళుతోంది?

జ: 30 ట్రిలియన్‌ డాలర్లు
(సుమారు రూ.2500 లక్షల కోట్లు)


  • 2023-24లో దేశంలో ఉపాధి హామీ పథకం కింద వివిధ రాష్ట్రాలు చెల్లించిన సగటు దినసరి కూలీ ఎంత మొత్తంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి? (కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖపై ఏర్పాటైన    పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల లోక్‌సభకు సమర్పించిన నివేదికలో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ వేతనాల్లో భారీ వ్యత్యాసాలు ఉంటున్నట్లు విశ్లేషించింది.)

జ: రూ.259జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ) డైరెక్టర్‌ జనరల్‌గా సదానంద్‌ వసంత్‌ దాతెను నియమిస్తూ కేంద్ర హోంశాఖ 2024, మార్చి 27న ఉత్తర్వులు జారీచేసింది. ఆయన మహారాష్ట్ర ‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్‌ఐఏ డీజీగా ఉన్న దినకర్‌ గుప్తా మార్చి 31న పదవీ విరమణ చేశాక ఆయన స్థానంలో సదానంద్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. 2026 డిసెంబరు 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

  • ‘జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం’ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) అధిపతిగా పీయూష్‌ ఆనంద్‌ను కేంద్రం నియమించింది. ఈయన ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌ ప్రత్యేక డీజీగా ఉన్నారు.
  • ‘బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రిసెర్చ్‌, డెవలప్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌గా రాజస్థాన్‌ క్యాడర్‌కు చెందిన 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ రాజీవ్‌ కుమార్‌ శర్మ నియమితులయ్యారు.

అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్‌ఐహెచ్‌ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్‌ గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ నియమితుడయ్యాడు. చిలీ మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి కమిలా కూడా సహ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు.


ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది తీవ్ర ఆకలి కేకలతో అలమటిస్తున్నారని, పలు దేశాల్లో ఆహార సంక్షోభం మరింత ముదురుతోందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 2022లో ఉత్పత్తి అయిన ఆహారంలో 19 శాతం వృథా అయిందని, అది 100 కోట్ల టన్నులని పేర్కొంది. ఐరాస పర్యావరణ పథకం 2024, మార్చి 27న విడుదల చేసిన ఆహార వృథా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.


మరింత సమాచారం కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని