కాలుష్యమేదైనా.. కారణం మనమే..

నేలలో నీరు, గాలి, ఖనిజ, సేంద్రియ పదార్థాలు ఉంటాయి.

Published : 31 Mar 2024 01:53 IST

నేల, ధ్వని కాలుష్యం
ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం కెమిస్ట్రీ
నేల/భూ కాలుష్యం

నేలలో నీరు, గాలి, ఖనిజ, సేంద్రియ పదార్థాలు ఉంటాయి.

  • మానవ కార్యకలాపాలతో ఏదైనా పదార్థాలు నేలలోకి కొత్తగా చేరి, దానిలోని అనుఘటక పదార్థాలను తొలగించడంతో నేల సహజ సంఘటనం, లక్షణాలు ప్రభావితమవుతాయి. ఫలితంగా నేల ఉత్పాదక సామర్థ్యం తగ్గడాన్నే ‘నేల కాలుష్యం’ అంటారు.

దుష్ప్రభావాలు: నేల కాలుష్యం పర్యావరణం, ఆవరణ వ్యవస్థలు, మానవ ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తోంది.

నేలసారం తగ్గడం: నేలలోని కాలుష్య పదార్థాలు నేల నాణ్యతను తగ్గించడమే కాకుండా పంటల దిగుబడిని తగ్గిస్తాయి. ఫలితంగా ఆహార భద్రతపై ప్రభావం పడుతోంది.

జీవవైవిధ్యంపై ప్రభావం: నేల కాలుష్యం వల్ల పర్యావరణ వ్యవస్థలు దెబ్బతిని జీవవైవిధ్య నష్టానికి దారి తీస్తుంది. ఈ కాలుష్యం వానపాములు, సూక్ష్మజీవులపై ప్రభావాన్ని చూపి ఆహార గొలుసులు, పర్యావరణ సమతౌల్యతను దెబ్బతీస్తాయి. నేల కాలుష్యంతో అడవులు తగ్గిపోతాయి.

మానవ ఆరోగ్యంపై ప్రభావం: కాలుష్యానికి గురైన నేలలో పండించిన పంట ఉత్పత్తుల్లో పోషక పదార్థాలు తక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలు కలుషితమైన మట్టిలో ఆడుకోవడంతో చర్మ వ్యాధులు, నరాల సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.

నీటి కాలుష్యం: నేల ద్వారా కాలుష్యకాలు భూగర్భ జలాల్లోకి చేరి, తాగునీటి వనరులు, జలావరణ వ్యవస్థలను కలుషితం చేస్తాయి.


కాలుష్యానికి కారణాలు:

పారిశ్రామిక కార్యకలాపాలు: పరిశ్రమలు సరైన వ్యర్థ నిర్వహణ పద్ధతులను పాటించకపోవడంతో నిల్వ ప్రక్రియలో లీకేజీ ద్వారా ప్రమాదకర రసాయనాలు, పాదరసం, ఆర్సెనిక్‌, సీసం లాంటి భారలోహాలు, విష పదార్థాలు నేలలోకి చేరి కాలుష్యానికి దారి తీస్తాయి.
వ్యవసాయ పద్ధతులు: రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు నివారణ మందులు అధికంగా ఉపయోగించడంతో నేల కాలుష్యానికి గురవుతోంది. రసాయనిక ఎరువులను విరివిగా ఉపయోగించడంతో మృత్తికలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. ఫలితంగా నేల సారం తగ్గడమే కాకుండా నేలలో లవణ సాంద్రత పెరుగుతుంది.
మైనింగ్‌ కార్యకలాపాలు: మైనింగ్‌ కార్యకలాపాలు భారీ లోహాలు, సల్ఫర్‌ సమ్మేళనాలు, రేడియోధార్మిక పదార్థాల లాంటి హానికరమైన వాటిని మట్టిలోకి విడుదల చేస్తాయి. ఫలితంగా భూమి కలుషితమై వ్యవసాయానికి లేదా ఇతర అవసరాలకు పనికి రాకుండా పోతోంది.

వ్యర్థ పదార్థాల అస్తవ్యస్త నిర్వహణ: ఇళ్ల నుంచి వెలువడే వ్యర్థాలు, ఎలక్ట్రానిక్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, వైద్య రంగానికి చెందిన వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడంతో నేల కాలుష్యానికి గురవుతుంది.

నిర్మాణ కార్యకలాపాలు: నిర్మాణ కార్యకలాపాల్లో వివిధ రసాయనాలు ఉపయోగించడంతో నేల కాలుష్యం ఏర్పడుతోంది.

ఆమ్ల వర్షాలు: వాతావరణ కాలుష్యం కారణంగా కురిసే ఆమ్ల వర్షాలతో(Acid rains) సారవంతమైన నేలలు దెబ్బతింటున్నాయి. ఫలితంగా నేలలోPH - విలువలు తగ్గి ఆమ్ల స్వభావం పెరుగుతోంది.


నివారణ పద్ధతులు:

వివిధ పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలను సాధ్యమైనంత వరకు నియంత్రించి, వాటి విష ప్రభావాన్ని తగ్గించే పద్ధతులను పాటించాలి.

  • సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, పంట మార్పిడి, సమీకృత తెగుళ్ల నిర్వహణ లాంటి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంతో రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలపై ఆధారపడటాన్ని తగ్గించి నేల కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
  •  నివాస గృహాల నుంచి వెలువడే వ్యర్థాలను జీవ విచ్ఛిన్నశీలత వ్యర్థ పదార్థాలుగా, జీవ విచ్ఛిన్నశీలత లేని వ్యర్థ పదార్థాలుగా వేరుచేయడం.
  •  ప్లాస్టిక్‌, గాజు, లోహపు వ్యర్థాలు మొదలైన జీవ విచ్ఛిన్నశీలత లేని పదార్థాలను రీసైక్లింగ్‌ చేయడం.
  • జీవ విచ్ఛిన్నశీలత ఉన్న వ్యర్థ పదార్థాలను గుంతల్లో పూడ్చి కంపోస్టుగా మార్చడం లాంటి  ఘన పదార్థాల నిర్వహణ ్బళ్నీఃi్ట ‌్ర్చ(్మ’ ్ఝ్చ-్చ్ణ’్ఝ’-్మ్శ పద్ధతులను పాటించడంతో నేల కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు.
  •  నేల పరిరక్షణ, కాలుష్య నివారణ ప్రాముఖ్యతపై రైతులకు, పరిశ్రమ యాజమాన్యాలకు అవగాహన కల్పించడంతో నేల కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు.


శబ్ద/ధ్వని కాలుష్యం

అత్యధిక స్థాయి ధ్వనులు (మోత) మానవ, వన్యప్రాణుల ఆరోగ్యం, పర్యావరణ సమతౌల్యతపై హానికరమైన ప్రభావాలను చూపిస్తాయి. దీన్నే ‘ధ్వని/శబ్ద కాలుష్యం’ అంటారు.

కాలుష్యానికి కారణాలు:

పట్టణీకరణ, పారిశ్రామికీకరణ శబ్ద కాలుష్యం తీవ్రతను పెంచాయి.

  •  ఎడతెగని వాహనాల రాకపోకలు, నిర్మాణ కార్యకలాపాలు, పారిశ్రామిక యంత్రాలు మొదలైనవి ధ్వని కాలుష్యానికి ప్రధాన మూలాలుగా చెప్పవచ్చు.
  •  అధిక శబ్ద తీవ్రత కలిగిన సంగీతం, పేలుళ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, రాకెట్లు, క్షిపణులు, బాణాసంచా, ఎలక్ట్రికల్‌ జనరేటర్లు, ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రిక్‌ గృహోపకరణాలు తదితరల నుంచి వెలువడే శబ్ద ఉద్గారాలు ధ్వని కాలుష్యానికి దారితీస్తాయి.

హానికర ప్రభావాలు

ఒక వ్యక్తి ఒకరోజుకి 8 గంటల పాటు 85 డెసిబెల్స్‌ ్బ్టత్శీ కంటే ఎక్కువ తీవ్రత ఉన్న ధ్వనులను వింటే ఆరోగ్యం దెబ్బతింటుంది.

  •  ధ్వని కాలుష్యం వల్ల మనిషి ఆలోచనా శక్తి, సృజనాత్మకత, ఏకాగ్రత తగ్గుతాయి. ఇది నిద్రలేమి, అలసటకు కారణమవుతుంది.
  • దీర్ఘకాలం ధ్వని కాలుష్యానికి గురైన వ్యక్తిలో రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతాయి.
  •  ఒక వ్యక్తి 105 ్టతీ కంటే ఎక్కువ తీవ్రత కలిగిన ధ్వనులను దీర్ఘకాలం వింటే శాశ్వత వినికిడి లోపం ఏర్పడవచ్చు.
  • ధ్వని కాలుష్యం టిన్నిటస్‌ లాంటి శ్రవణ రుగ్మతలకు దారి తీస్తుంది. అధిక ధ్వని కాలుష్యానికి గురైన వ్యక్తి నిశ్శబ్ద ప్రాంతాలకు వెళ్లినప్పుడు చెవిలో ఏదో ఒక శబ్దం వినిపిస్తున్నట్లు అనిపించే మానసిక స్థితిని టిన్నిటస్‌ అంటారు.
  • శబ్ద కాలుష్యం మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశను కలిగిస్తుంది. జీవన నాణ్యతను క్షీణింపజేస్తుంది.
  • ఈ కాలుష్యం వన్యప్రాణుల ఆవాసాలకు అంతరాయం కలిగిస్తుంది. వాటి పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి మార్గాలు:

ఎక్కువ ధ్వనినిచ్చే పరికరాలను దూరంగా ఉంచడం, తక్కువ ధ్వనినిచ్చే పరికరాలను ఎంచుకోవడం.

  • పెట్రోల్‌ లేదా డీజిల్‌తో నడిచే పరికరాలకు బదులు విద్యుత్‌ లేదా బ్యాటరీతో నడిచే పరికరాలను ఉపయోగించడం.
  •  పారిశ్రామిక ప్రాంతాలను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచడం.
  •  చెట్లను ఎక్కువగా పెంచితే అవి అధిక స్థాయి ధ్వని తరంగాలను గ్రహిస్తాయి. సాధారణంగా చెట్లు అవాంఛిత శబ్దాన్ని 50 శాతం వరకు తగ్గించగలవు.
  •  పెద్ద శబ్దాలను నివారించలేనప్పుడు ఇయర్‌ప్లగ్‌ ్బన్చి౯్పః్య్ణ(్శ, ఇయర్‌మఫ్‌లను ్బన్చి౯్ఝ్య÷÷(్శ ఉపయోగించి వినికిడి రక్షణ పొందవచ్చు.
  •  పిల్లలను అధిక శబ్ద తీవ్రత ఉండే సంగీతం, వాటి పరికరాల నుంచి దూరంగా ఉంచాలి.
  •  ఆస్పత్రులు, బోధనా సంస్థలు లాంటి సున్నితమైన ప్రదేశాల్లో హారన్‌ ఉపయోగించడాన్ని నిషేధించడం.
  •  వాణిజ్య, పారిశ్రామిక భవనాల్లో సౌండ్‌ప్రూఫ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయడం.
  •  అటవీ, పర్వతాలు, మైనింగ్‌ ప్రాంతాల్లో అనధికారికంగా పేలుడు పదార్థాలను ఉపయోగించకపోవడం.
  •  పట్టణ ప్రణాళికలో శబ్ద వ్యాప్తిని తగ్గించడానికి గ్రీన్‌స్పేస్‌ ్బబి౯’’-(్ప్చ‘’్శ, పాదచారుల జోన్‌ ్బశి’్ట’(్మ౯i్చ- ్ట్న్ర-’(్శ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం.

​​​​​​​


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని