ఓటీపీ చెప్పి.. ఖాతాలో నగదు పోగొట్టుకుని..

ఓటీపీ చెప్పడంతో బ్యాంకు ఖాతాలో నగదు పోయిన సంఘటనపై ఉండవల్లి ఠాణాలో శనివారం కేసు నమోదైనట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాద్‌ తెలిపారు.

Published : 31 Mar 2024 03:50 IST

ఉండవల్లి, న్యూస్‌టుడే: ఓటీపీ చెప్పడంతో బ్యాంకు ఖాతాలో నగదు పోయిన సంఘటనపై ఉండవల్లి ఠాణాలో శనివారం కేసు నమోదైనట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాద్‌ తెలిపారు. ఉండవల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని రమాదేవి ఆన్‌లైన్‌లో వాచీ బుక్‌ చేసింది. వెంటనే వద్దనుకుని రద్దు చేసేందుకు వివరాల కోసం వెతికింది. అదేక్రమంలో ఆమె చరవాణికి ఫోన్‌ వచ్చింది. ఆర్డర్‌ రద్దు చేయాలంటే చరవాణికి వచ్చిన ఓటీపీ చెప్పాలని కోరడంతో అలాగే చేసింది. కొద్దిసేపటికి ఆమె ఖాతాలో రూ.83,286 డ్రా అయిపోయాయి. దీనిపై ఉండవల్లి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఎస్సై శ్రీనివాసులు కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని