కరెంట్‌ అఫైర్స్‌

ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) 41వ జాతీయ అధ్యక్షురాలిగా జోయ్‌శ్రీ దాస్‌ వర్మ 2024, మార్చి 29న బాధ్యతలు స్వీకరించారు. 2024-25 ఏడాదికి ఆమె ఈ హోదాలో కొనసాగుతారు.

Published : 01 Apr 2024 00:26 IST

ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) 41వ జాతీయ అధ్యక్షురాలిగా జోయ్‌శ్రీ దాస్‌ వర్మ 2024, మార్చి 29న బాధ్యతలు స్వీకరించారు. 2024-25 ఏడాదికి ఆమె ఈ హోదాలో కొనసాగుతారు. ఈశాన్య భారతానికి గౌరవ కాన్సుల్‌గా జోయ్‌శ్రీని ఇజ్రాయెల్‌ నియమించింది. వర్మ కాప్రో మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.


తేజస్‌ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్‌ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. 2024, మార్చి 28న బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ సంస్థ ప్రాంగణంలో ఈ ప్రయోగం నిర్వహించారు.


హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ నిర్వహించిన రాకెట్‌ స్టేజ్‌-2 పరీక్ష విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) వేదికగా 2024, మార్చి 28న ఈ ప్రయోగం నిర్వహించారు.


కేంద్ర ప్రభుత్వ అప్పులు 2023, డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. 2023, సెప్టెంబరులో ఇవి రూ.157.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. కేంద్ర ఆర్థికశాఖ 2024, మార్చి 28న ఈ వివరాలను వెల్లడించింది.


కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని