కరెంట్‌ అఫైర్స్‌

విజ్ఞాన శాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? (అనేక దేశాల్లో మహిళా ఆవిష్కర్తల ఎదుగుదలకు సరైన   అవకాశాలు ఉండటంలేదని భావించిన ఐక్యరాజ్య సమితి ఏటా ఈ రోజున ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

Published : 01 Apr 2024 00:27 IST

మాదిరి ప్రశ్నలు

విజ్ఞాన శాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? (అనేక దేశాల్లో మహిళా ఆవిష్కర్తల ఎదుగుదలకు సరైన   అవకాశాలు ఉండటంలేదని భావించిన ఐక్యరాజ్య సమితి ఏటా ఈ రోజున ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, ఇంజినీరింగ్‌, గణితం (స్టెమ్‌) రంగాల్లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు ఐరాస కృషి చేస్తోంది.)

జ: ఫిబ్రవరి, 11


2024-25 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి ఎంత మొత్తం కేటాయించింది? (2024-25 రక్షణ కేటాయింపులు 2023-24 కంటే 4.72 శాతం, 2022-23 కంటే 18.35 శాతం అధికం. ఈ డిఫెన్స్‌ కేటాయింపులను నాలుగు విభాగాల్లో ఖర్చు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. రక్షణ శాఖ పరిధిలోని పౌర సంస్థలకు 4.11 శాతం; ఆయుధాలు, మందు గుండు నిల్వల నిర్వహణకు 14.82 శాతం, కొత్త ఆయుధాల సేకరణకు 27.67 శాతం, రక్షణ సిబ్బంది జీత భత్యాలకు 30.68 శాతం, పింఛన్లకు 22.72 శాతం వెచ్చిస్తామని పేర్కొంది.)

జ: రూ.6,21,540 కోట్లు


దేశంలో వంట నూనెల ధరలను అదుపులో ఉంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ముడి, శుద్ధి చేసిన వంటనూనెల  దిగుమతిపై ఉన్న సుంకం రాయితీని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది? (వాస్తవానికి ఈ గడువు 2024, మార్చితో ముగిసింది.)

జ: 2025, మార్చి


గూఢచర్య ఆరోపణలపై ఏ దేశ జైలులో 2022 నుంచి మగ్గుతూ, మరణ శిక్ష పడిన ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళ సీనియర్‌ సిబ్బందిని అక్కడి ప్రభుత్వం 2024, ఫిబ్రవరి 12న విడుదల చేసింది? (ఈ ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ సిబ్బంది ఇజ్రాయెల్‌ పక్షాన గూఢచర్యం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 2022, ఆగస్టు 30న అరెస్టయిన వీరికి స్థానిక  న్యాయస్థానం మరణ దండన   విధించింది. తాజాగా వీరికి అభియోగాల నుంచి విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించారు.)

జ: ఖతార్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని