కరెంట్‌ అఫైర్స్‌

ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024, ఫిబ్రవరి 15న దిల్లీలో విడుదల చేసిన మూడు సావనీర్‌ నాణేలు ఏవి?

Published : 02 Apr 2024 00:55 IST

మాదిరి ప్రశ్నలు

ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024, ఫిబ్రవరి 15న దిల్లీలో విడుదల చేసిన మూడు సావనీర్‌ నాణేలు ఏవి?

జ: అయోధ్యలోని రామ్‌లల్లా, రామ జన్మభూమి బొమ్మలు; బుద్ధుడి జ్ఞానోదయం బొమ్మ, ఖడ్గమృగం బొమ్మ.


2018 నుంచి 2024 జనవరి వరకు విదేశాల్లో చనిపోయిన విద్యార్థుల సంఖ్య 403 కాగా, వారిలో అత్యధికంగా 91 మంది ఏ దేశంలో దుర్మరణం పాలయ్యారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది?(ఈ దేశం తర్వాత ఎక్కువగా బ్రిటన్‌ (48), రష్యా (40), అమెరికా (36), ఆస్ట్రేలియా (35) దేశాల్లో ఈ మరణాలు సంభవించాయి. జాత్యహంకారంతో పాటు అనేక ఇతర కారణాలు ఇందుకు దారి తీస్తున్నట్లు వెల్లడైంది.)

జ: కెనడా


రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏ రోజున సంచలన తీర్పు వెలువరించింది? (ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఎన్నికల బాండ్ల ప్రక్రియ ఉందని పేర్కొంటూ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌  (ఏడీఆర్‌)’, సీపీఎం, కాంగ్రెస్‌ నేత జయా ఠాగూర్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌. గవాయి, జస్టిస్‌ జె.బి. పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 232 పేజీల తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది. నలుగురు న్యాయమూర్తుల తరఫున 152 పేజీల్లో ప్రధాన తీర్పును సీజేఐ రాయగా, వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా విడిగా 80 పేజీల తీర్పు ఇచ్చారు.)

జ: 2024, ఫిబ్రవరి 15గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని