కరెంట్‌ అఫైర్స్‌

పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచి ‘ఇండియా సెల్ఫీ పాయింట్‌’గా పేరుగాంచిన ప్రాంతం ఎక్కడ ఉంది?

Published : 03 Apr 2024 00:31 IST

మాదిరి ప్రశ్నలు

పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచి ‘ఇండియా సెల్ఫీ పాయింట్‌’గా పేరుగాంచిన ప్రాంతం ఎక్కడ ఉంది?
జ:
కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)కు సమీపంలో ఉన్న ఉరీ వద్ద (జీలం నది అందాలు, విశాలమైన కశ్మీర్‌ లోయలను చూడటానికి ఈ ప్రదేశం అనువుగా ఉంటుంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభించారు. నాగీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు రూబుల్‌ నాగీ ఈ సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటుకు కృషి చేశారు.)

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, ఈ పథకాన్ని వెంటనే నిలిపి వేయాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికల బాండ్లు ఏయే డినామినేషన్లలో లభించేవి? (ఎన్నికల బాండ్లు ప్రామిసరీ నోట్ల లాంటివి. ఇవి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లోనే లభ్యమవుతాయి. భారత పౌరులు, దేశీయ కంపెనీలు వీటిని ఎన్నైనా కొనుగోలు చేయవచ్చు. నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చు. బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తి లేదా సంస్థ వివరాలను ఎస్‌బీఐ గోప్యంగా ఉంచుతుంది. తమకు వచ్చిన బాండ్లను 15 రోజుల్లో రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకోవాలి. లేకపోతే ఆ నిధులు ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి ఖాతాలోకి వెళ్లిపోతాయి.)
జ:
రూ.1000, రూ.10,000, రూ.లక్ష, రూ.10 లక్షలు, రూ.కోటి (మొత్తం అయిదు డినామినేషన్లు)


అసోం రాష్ట్ర 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రవి కోత 31 మార్చి 2024న బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1993వ బ్యాచ్‌ అసోం-మేఘాలయ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. రవి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామం.


అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) 2023, ఏప్రిల్‌ 1న ప్రకటించిన ఏటీపీ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో సుమిత్‌ నగాల్‌ 95వ స్థానంలో నిలిచాడు. ఇది అతడి కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు. 2024, ఫిబ్రవరిలో నగాల్‌ 97వ ర్యాంకులో ఉన్నాడు.


జీఎస్‌టీ వసూళ్లు 2024, మార్చిలో రూ.1.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023, మార్చితో పోలిస్తే ఇవి 11.5% అధికం. జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చాక, నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇది రెండో అత్యధికం. 2023 ఏప్రిల్‌లో నమోదైన రూ.1.87 లక్షల కోట్ల వసూళ్లే ఇప్పటివరకు అత్యధికం.


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఏర్పడి 2024, ఏప్రిల్‌ 1 నాటికి 90 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ 90 ఏళ్ల వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ముంబయిలో ప్రారంభించారు. అదే వేదికపై స్మారక నాణేన్ని విడుదల చేశారు.


కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని