కరెంట్‌ అఫైర్స్‌

2024, ఫిబ్రవరిలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ప్రకటించిన గణాంకాల ప్రకారం భారత్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఎంత మొత్తంగా ఉంది?

Published : 09 Apr 2024 00:43 IST

ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!
మాదిరి ప్రశ్నలు

  • 2024, ఫిబ్రవరిలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ప్రకటించిన గణాంకాల ప్రకారం భారత్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఎంత మొత్తంగా ఉంది? (27,97,400 కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థతో అమెరికా; 18,56,600 కోట్ల డాలర్లతో చైనా; 4,73,000 కోట్ల డాలర్లతో జర్మనీ; 4,29,100 కోట్ల   డాలర్లతో జపాన్‌లు వరుసగా భారత్‌ కంటే ముందున్నట్లు ఐఎంఎఫ్‌ ప్రకటించింది.)

జ: 4,11,200 కోట్ల డాలర్లు

  • కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల విడుదల చేసిన సమీక్ష పత్రం ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారత్‌ ఏడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది?  (గడిచిన పదేళ్లలో దేశ ఆర్థికంపై ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని ఈ సమీక్ష పత్రం నివేదించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు ఏడు శాతంగా ఉంటుందని అంచనా వేసింది. జీఎస్టీ సంస్కరణలు, మౌలిక వసతుల విస్తరణకు భారీ ప్రభుత్వ పెట్టుబడులు, ఆర్థిక లోటుకు పగ్గాలు వేయడం, డిజిటల్‌ చెల్లింపులు, దివాలా చట్టాల సంస్కరణ లాంటి విధానాలతో భారత్‌ ఏడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశిస్తున్నారు.)

జ: 2030

  • 2017-18లో దేశంలో మహిళా కార్మిక  భాగస్వామ్య రేటు 23.3 శాతం ఉండగా, 2022-23 నాటికి అది ఎంత శాతానికి పెరిగినట్లు  అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి?

జ: 37 శాతం

  • ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఎంత మొత్తంతో ‘అంబ్రెల్లా’ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది?

జ: రూ.1179.72 కోట్లు (2021-22 నుంచి 2025-26 వరకు ఈ పథకం కాలపరిమితిగా నిర్ణయించారు. మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయంలో రూ.885.49 కోట్లను కేంద్ర హోంశాఖ తన బడ్జెట్‌ నుంచి అందిస్తుంది. మిగిలిన రూ.294.23 కోట్లను నిర్భయ నిధి ద్వారా సమకూరుస్తారు. ఈ పథకం కింద 112 అత్యవసర స్పందన మద్దతు వ్యవస్థ 2.0ను కొనసాగిస్తారు. మహిళలు, చిన్నారులకు వ్యతిరేకంగా జరిగే సైబర్‌ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. మహిళా సహాయ కేంద్రాలు, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు