కరెంట్‌ అఫైర్స్‌

భారత్‌ అగ్రశ్రేణి టెన్నిస్‌ సింగిల్స్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ ఏటీపీ మాస్టర్స్‌ టోర్నీ ప్రధాన డ్రా సింగిల్స్‌లో ఒక మ్యాచ్‌ గెలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా నిలిచాడు.

Published : 10 Apr 2024 00:13 IST

భారత్‌ అగ్రశ్రేణి టెన్నిస్‌ సింగిల్స్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ ఏటీపీ మాస్టర్స్‌ టోర్నీ ప్రధాన డ్రా సింగిల్స్‌లో ఒక మ్యాచ్‌ గెలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా నిలిచాడు. 2024, ఏప్రిల్‌ 8న మాంటెకార్లో మాస్టర్స్‌ టోర్నీలో ప్రపంచ 38వ ర్యాంకర్‌ ఆర్నాల్డి (ఇటలీ)ని నగాల్‌ ఓడించాడు. ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నీ పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్లో 93వ ర్యాంకర్‌ సుమిత్‌ ఆర్నాల్డిపై గెలిచాడు.


ఐఏయూ 24 గంటల ఆసియా ఓసియానియా అల్ట్రా రన్నింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ టైటిల్‌ నెగ్గింది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో జరిగిన 24 గంటల పరుగులో భారత్‌ వరుసగా రెండోసారి విజేతగా నిలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో అమర్‌సింగ్‌ దేవాందా తన పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలుకొట్టి బంగారు పతకం సాధించాడు. 24 గంటల్లో అమర్‌ 272.537 కిలోమీటర్లు పరిగెత్తి అగ్రస్థానం సాధించాడు. 2022లో బెంగళూరులో జరిగిన పరుగులోనూ అమర్‌ (257.618 కి.మీ.) విజేతగా నిలిచాడు.


భారత్‌లో అసెంబుల్‌ చేసి, పరీక్షించిన సబ్‌మీటర్‌ ఆప్టికల్‌ ఉపగ్రహం ‘టీశాట్‌-1ఏ’ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏఎస్‌ఎల్‌) 2024, ఏప్రిల్‌ 8న ప్రకటించింది. స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా దీన్ని రోదసిలోకి చేరవేసినట్లు తెలిపింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.


మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ చరిత్రలోనే తొలిసారిగా రూ.400 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. 2024, ఏప్రిల్‌ 8న ఈ విలువ రూ.4,00,86,722.74 కోట్ల (4.81 లక్షల కోట్ల డాలర్ల) వద్ద స్థిరపడింది.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని