కరెంట్‌అఫైర్స్‌

భారతదేశంలో తొలి మహిళా పిచ్‌ క్యూరేటర్‌గా ఎవరు ఘనత సాధించారు? (బెంగళూరులో జరిగిన ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టోర్నీకి ఈమె పిచ్‌ క్యూరేటర్‌గా వ్యవహరించారు.

Published : 10 Apr 2024 00:14 IST

మాదిరి ప్రశ్నలు

భారతదేశంలో తొలి మహిళా పిచ్‌ క్యూరేటర్‌గా ఎవరు ఘనత సాధించారు? (బెంగళూరులో జరిగిన ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టోర్నీకి ఈమె పిచ్‌ క్యూరేటర్‌గా వ్యవహరించారు. గతంలో మొదటి మహిళా క్రికెట్‌ అంపైర్‌గా వృందా రాఠీ, మొదటి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళా మ్యాచ్‌ రిఫరీగా జి.ఎస్‌.లక్ష్మి ఘనత
సాధించారు.)

జ: జసింత కల్యాణ్‌


పారిస్‌ ఒప్పందం ప్రకారం ఏ సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాల తటస్థత (నెట్‌ జీరో ఎమిషన్‌) సాధించాలన్న లక్ష్య సాధనలో భాగంగా 2023 అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం ‘గ్రీన్‌ క్రెడిట్‌ ప్రోగ్రాం’ను రూపొందించింది? (కర్బన ఉద్గారాల తగ్గింపు, గాలి, నీటి లభ్యత పెంపు, జీవ వైవిధ్యం మెరుగుదల వంటి సానుకూల పరిణామాల సాధనకు వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఈ ప్రోగ్రాంను రూపొందించినట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని క్షీణించిన అడవుల్లో కనీసం అయిదు హెక్టార్లకు తక్కువ కాని ప్రాంతంలో మొక్కల పెంపకాన్ని చేపట్టే సంస్థలకు పెరిగిన ప్రతి చెట్టుకు ఒక గ్రీన్‌ క్రెడిట్‌ చొప్పున అందిస్తారు. హెక్టారుకు 1100 చెట్ల సాంద్రతను షరతుగా నిర్దేశించిన కేంద్రం అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు మళ్లించిన సందర్భంలో అందుకు పరిహారంగా పెంచాల్సిన అడవికి బదులు ఈ గ్రీన్‌ క్రెడిట్‌ను మార్పిడి చేసుకోవచ్చని పేర్కొంది.)

జ: 2070


సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) తొలి స్నైపర్‌గా ఇటీవల రికార్డులకెక్కిన పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌?

జ: సుమన్‌ కుమారి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు