కరెంట్‌ అఫైర్స్‌

2024, ఫిబ్రవరిలో భార్య యూజినీతో కలిసి కారుణ్య మరణానికి అనుమతి పొంది మరణించిన డ్రైస్‌ వాన్‌ అగ్ట్‌ (93) ఏ దేశానికి 1977-82 కాలంలో ప్రధానిగా పని చేశారు?

Published : 11 Apr 2024 01:29 IST

మాదిరి ప్రశ్నలు

2024, ఫిబ్రవరిలో భార్య యూజినీతో కలిసి కారుణ్య మరణానికి అనుమతి పొంది మరణించిన డ్రైస్‌ వాన్‌ అగ్ట్‌ (93) ఏ దేశానికి 1977-82 కాలంలో ప్రధానిగా పని చేశారు? (70 ఏళ్ల అన్యోన్య జీవితం గడిపిన ఈ జంట తుది దశలో రోగగ్రస్తులైన నేపథ్యంలో బతుకు భారమనిపించి కారుణ్య మరణానికి అనుమతి పొందారు. చేయి చేయి కలిపి, కళ్లలోకి ఆత్మీయంగా చూసుకుంటూ, చితిలో సైతం జతగా ఉంటామనే ఉదాత్త భావనకు  పరమోదాహరణగా ‘పాయిజన్‌ ఇంజక్షన్‌’తో జీవితాలకు ముగింపు పలికారు.)

జ: నెదర్లాండ్స్‌


ఏ ఆరు నదుల పరీవాహక ప్రాంతాల్లో కాలుష్య కట్టడే లక్ష్యంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశంలోని పన్నెండు ప్రఖ్యాత అత్యున్నత విద్యా సంస్థలతో ఇటీవల ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? (కాన్పుర్‌ ఐఐటీ సారథ్యంలో ఏడు విద్యాసంస్థలు గంగానది పరీవాహక నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి కేంద్రానికి అందించాయి. అది సత్ఫలితాలను ఇస్తున్న  నేపథ్యంలో కేంద్రం ఇలా విస్తృత కార్యాచరణపై దృష్టి సారించింది.)

జ: కృష్ణా, గోదావరి, కావేరి, మహానది, పెరియార్‌, నర్మదా


2024-25 ఐక్యరాజ్య సమితి బడ్జెట్‌కు భారత్‌ తన వాటాగా ఎంత మొత్తాన్ని కేటాయించింది? (2023-24లో ఈ మొత్తం 4.7 కోట్ల డాలర్లు (రూ.382.54 కోట్లు)గా ఉంది. భారత్‌ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలనుకుంటోంది. కానీ ఈ  విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో తన మనోభావాలను నిర్మొహమాటంగా చాటి చెప్పేందుకు ఐరాసకు కేటాయించే వార్షిక నిధుల్లో ఇలా భారీగా (2023-24తో పోలిస్తే 54.25 శాతం తగ్గింపు) కోత విధించింది. ఐక్యరాజ్య సమితి మొత్తం బడ్జెట్‌ 340 కోట్ల డాలర్లు.)

జ: 2.1 కోట్ల డాలర్లు (రూ.175 కోట్లు)



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని