కేంద్రక స్థిరత్వానికి సూచిక... సగటు బంధన శక్తి

విశ్వానికి మూలం పరమాణువు. అయితే పరమాణువుకి మూలం కేంద్రకం (Nueleus). నక్షత్రాల ఆవిర్భావం, విధ్వంసకర అణుబాంబు, హైడ్రోజన్‌ బాంబులు, క్యాన్సర్‌ చికిత్స, కార్బన్‌ డేటింగ్‌, భూమి వయసు మొదలైన అంశాలన్నింటితో కేంద్రకం ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంది.

Published : 12 Apr 2024 00:18 IST

టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం ఫిజిక్స్‌

శ్వానికి మూలం పరమాణువు. అయితే పరమాణువుకి మూలం కేంద్రకం (Nueleus). నక్షత్రాల ఆవిర్భావం, విధ్వంసకర అణుబాంబు, హైడ్రోజన్‌ బాంబులు, క్యాన్సర్‌ చికిత్స, కార్బన్‌ డేటింగ్‌, భూమి వయసు మొదలైన అంశాలన్నింటితో కేంద్రకం ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంది. పరీక్షార్థులు వీటిపై అవగాహన కలిగి ఉండటం అవసరం.

కేంద్రక భౌతికశాస్త్రం (Nuclear Physics) 

కేంద్రకం

ఊహకు అందని అతి చిన్న ప్రదేశంలో అత్యంత శక్తిని, ద్రవ్యాన్ని కూడగట్టుకుని తన చుట్టూ ఎలక్ట్రాన్‌ మేఘాలను తిప్పుకునే పదార్థమే కేంద్రకం. మరోవిధంగా చెప్పాలంటే విశ్వం ఏర్పడటానికి కారణం కేంద్రకం.

  •  సుమారు 1015్ఝ వ్యాసార్ధంతో ఉండే గోళాకార కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఎలా ఇమిడి ఉంటాయో తెలుసుకునే ప్రయత్నమే కేంద్రక భౌతికశాస్త్రానికి పునాది.
  •  1896లో హెన్రీ బెకరల్‌ యాదృచ్ఛికంగా కనుక్కున్న సహజ రేడియోధార్మికత (Natural Radioactivit) కేంద్రకాన్ని కనుక్కోవడానికి తోడ్పడింది.
  •  బెకరల్‌ కిరణాల్లో భాగమైన ఆల్ఫా కణాలతో రూథర్‌ఫర్డ్‌ చేసిన బంగారు రేకు పరిక్షేపణ ప్రయోగంతో కేంద్రకం ఉనికి రూఢీ అయింది.
  •  కేంద్రకం ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనే కణాలతో నిర్మితమవుతుంది. ఈ రెండింటిని ‘న్యూక్లియాన్లు’(Nucleons) అని పిలుస్తారు.
  •  న్యూట్రాన్లు విద్యుత్‌ పరంగా తటస్థ ఆవేశాన్ని కలిగి ఉంటే ప్రోటాన్లు ధనావేశాన్ని కలిగి ఉంటాయి.
  •  ధనావేశిత ప్రోటాన్లు పరస్పరం వికర్షించుకోకుండా ఎలా కలిసి ఉంటాయో వివరించే ప్రయత్నంలో ‘కేంద్రక బలాలు(’Nuclear Forces ) తెరపైకి వచ్చాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని