కరెంట్‌ అఫైర్స్‌

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సభ్య దేశాల మంత్రుల 13వ సదస్సు (ఎంసీ 13)ను 2024, ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు ఎక్కడ నిర్వహించారు? (ప్రజావసరాల కోసం ఆహార ధాన్యాలను నిల్వ చేసే హక్కు ప్రభుత్వానికి ఉందన్న అంశాన్ని డబ్ల్యూటీఓ గుర్తించాలని భారత్‌ ఈ సదస్సులో కోరింది.

Published : 13 Apr 2024 01:11 IST

మాదిరి ప్రశ్నలు

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సభ్య దేశాల మంత్రుల 13వ సదస్సు (ఎంసీ 13)ను 2024, ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు ఎక్కడ నిర్వహించారు? (ప్రజావసరాల కోసం ఆహార ధాన్యాలను నిల్వ చేసే హక్కు ప్రభుత్వానికి ఉందన్న అంశాన్ని డబ్ల్యూటీఓ గుర్తించాలని భారత్‌ ఈ సదస్సులో కోరింది. డబ్ల్యూటీఓ సంస్థాపక సభ్య దేశం హోదాలో వర్ధమాన దేశాల ప్రయోజనాల పరిరక్షణకు భారత్‌ గళం వినిపిస్తోంది.)

జ: అబూధాబీ

ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? (వన్యప్రాణులు, వృక్ష జాతులు భూగోళంపై పర్యావరణ సమతౌల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. మితిమీరిన మానవ కార్యకలాపాల వల్ల వాటి మనుగడకు తీవ్ర ముప్పు కలుగుతోంది. ఈ క్రమంలో అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న అడవుల్లోని జంతు జాలం, వృక్ష జాతులను సమష్టిగా సంరక్షించుకోవాలనే లక్ష్యంతో 1973లో ఐరాస సాధారణ సభలో 183 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణలో డిజిటల్‌ ఆవిష్కరణలను అందుబాటులోకి తేవాలనే నినాదంతో ఈ ఏడాది ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.)
జ:
మార్చి 3

ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞా నిధి కళాప్రపూర్ణ గణపతి రాజు అచ్యుత రామరాజు శత జయంతి వేడుకలను 2024, మార్చి 5న నిర్వహించారు. 1924, మార్చి 5న ఈయన ఎక్కడ జన్మించారు? (ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాహిత్యోద్యమాలకు ఈయన జీవగర్ర. విశాఖ ప్రాంత సాంస్కృతిక చరిత్రలో వీరిది ఒక విశిష్ట అధ్యాయం. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1993లో ఈయనకు కళా ప్రపూర్ణ బిరుదు ప్రదానం చేసింది. 1977లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యులుగా ఎంపికయ్యారు. 1983-92 మధ్య కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ సలహాదారుగా వ్యవహరించారు.)

జ: కాకినాడ జిల్లా, తుని మండలం, కొలిమేరు గ్రామం


ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించే క్రీడాకారులకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) ప్రకటించింది. ఒలింపిక్స్‌లో నగదు బహుమతి అందజేసే మొదటి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యగా డబ్ల్యూఏ నిలవనుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో 48 విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచే క్రీడాకారులకు ఒక్కొక్కరికి 50,000 డాలర్లు (సుమారు రూ.41.60 లక్షలు) ప్రైజ్‌మనీ అందించనున్నట్లు వెల్లడించింది. 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌ నుంచి స్వర్ణంతో పాటు రజత, కాంస్య పతక విజేతలకు నగదు బహుమతులు ఇస్తామని పేర్కొంది.


లండన్‌కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషణల సంస్థ క్వాక్‌వారెల్లి సైమండ్స్‌ (క్యూఎస్‌) 2024 సంవత్సరానికి సంబంధించి వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల జాబితాను 2024, ఏప్రిల్‌ 10న వెల్లడించింది. వ్యాపార, నిర్వహణ (బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌) విద్యను అందించే విద్యాసంస్థల్లో ప్రపంచ ఉత్తమ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఐఐఎం-అహ్మదాబాద్‌ 25వ స్థానంలో నిలిచింది. ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-కలకత్తా టాప్‌-50 జాబితాలో చోటు సంపాదించాయి.


దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రపంచ విమానయాన సంస్థల్లో మూడో స్థానంలో నిలిచింది. 17.6 బి.డాలర్ల (సుమారు రూ. 1.46 లక్షల కోట్ల) మార్కెట్‌ విలువతో ఇండిగో ఈ ఘనత సాధించింది.


ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కి చెందిన ఉదిత్‌ రజతం సాధించాడు. 2024, ఏప్రిల్‌ 11న బిష్కెక్‌ (కిర్గిస్థాన్‌)లో జరిగిన 57 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగం ఫైనల్లో అతడు కెంటో యుమియా (జపాన్‌) చేతిలో ఓడాడు.


కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని