కరెంట్‌ అఫైర్స్‌

కోల్‌కతాలో జరిగిన ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ డాక్యుమెంటరీ పురస్కారం గెలుచుకున్న డాక్యుమెంటరీ ఏది?

Published : 14 Apr 2024 00:58 IST

మాదిరి ప్రశ్నలు

  • కోల్‌కతాలో జరిగిన ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ డాక్యుమెంటరీ పురస్కారం గెలుచుకున్న డాక్యుమెంటరీ ఏది? (78 ఏళ్ల డాక్టర్‌ అపర్ణ బుజర్‌ బారువా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈమె అస్సాంకు చెందినవారు. ధూలియా అనేది పురాతన కళారూపం. ధూలియా సంస్కృతి వైభవం గాయకుల పాటలు, ఆటలు, తోలు బొమ్మలాటలో కనిపిస్తుంది. గానం, నటన, హాస్య ప్రదర్శన, డప్పులు వాయించడం లాంటి ఎన్నో కళల సమాహారంగా ధూలియా సంస్కృతి ఉండేది. ఈ పురాతన కళారూపం గురించి ఊరూ వాడా తిరిగి లోతైన పరిశోధన చేసి అపర్ణ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.)

జ: ధూలియా కల్చర్‌ ఆఫ్‌ ఓల్డ్‌ కామరూప్‌

  • భారత్‌, శ్రీలంకల మధ్య 1998లో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)ను మరింత ఉన్నతీకరించుకోవడం ద్వారా ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందానికి (ఈటీసీఏ) కార్యరూపమిచ్చేందుకు గాను ఎన్నో విడత చర్చలను 2024 జనవరిలో న్యూదిల్లీలో నిర్వహించారు? (ప్రతిపాదిత ఒప్పందంలోని వివిధ అంశాలను పరిశీలించేందుకు ఇరు దేశాలు తొమ్మిది ఉప కమిటీలను ఏర్పాటు చేశాయి. ఇరు దేశాల మధ్య ఈటీసీఏపై 12వ రౌండ్‌ చర్చలను కొలంబోలో 2023, అక్టోబరు 30 నుంచి నవంబరు 1 వరకు నిర్వహించారు. రెండు దేశాల మధ్య 2016 నుంచి 2018 వరకు 11 రౌండ్ల ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.)

జ: 13వ విడత


Current Affairs

Russia successfully launched the Angara-A5 rocket from the Vostochny Cosmodrome on 11 April 2024. The Angara-A5 is a heavy-lift rocket designed to carry payloads exceeding 20 tonnes into orbit, roared into the sky. The Angara family of rockets, developed to replace the Soviet-designed Proton rockets.


Lindy Cameron was appointed as British High Commissioner to India on 11 April 2024. She replaced Alex Ellis. Lindy is the first woman to serve in this role since Britain and independent India established diplomatic relations in 1947.


The US-India Strategic and Partnership Forum (USISPF) appointed Tarun Bajaj (61) as the head of the US-India Tax Forum. He is the former Revenue Secretary and ex-secretary of Economic Affairs.
HDFC Bank inaugurated a branch in Lakshadweep's Kavaratti island. It became the first private sector lender to have a branch in the Lakshadweep. HDFC Bank has branches in the cold climes of Kashmir, the southern tip of Kanyakumari and now the island of Lakshadweep.


The International Day of Human Space Flight is observed every year on April 12.

2024 Theme: “Encouraging Scientific Curiosity”.


For more Current Affairs: Scan QR code


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని