కరెంట్‌ అఫైర్స్‌

అంతరిక్షంలోకి వెళ్లే భారత తొలి పర్యాటకుడిగా గోపీచంద్‌ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్‌ వ్యోమనౌకలో ఆయన కొద్దివారాల్లో రోదసిలోకి వెళ్లనున్నారు.

Published : 15 Apr 2024 00:51 IST

అంతరిక్షంలోకి వెళ్లే భారత తొలి పర్యాటకుడిగా గోపీచంద్‌ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్‌ వ్యోమనౌకలో ఆయన కొద్దివారాల్లో రోదసిలోకి వెళ్లనున్నారు. భారత్‌కు చెందిన రాకేశ్‌ శర్మ 1984లో అంతరిక్షయానం చేశారు. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌, రాజాచారి, శిరీష బండ్ల కూడా రోదసి యాత్రలు చేశారు. వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. గోపీచంద్‌ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్‌పోర్టు ఉంది. అందువల్ల రాకేశ్‌ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లే రెండో భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారు. దీనికితోడు ఆయన పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేయనున్నారు. తద్వారా భారత తొలి స్పేస్‌ టూరిస్టుగా గుర్తింపు పొందనున్నారు.

  • విజయవాడలో పుట్టిన గోపీచంద్‌ తోటకూర, అట్లాంటా శివారులోని ‘ప్రిజర్వ్‌ లైఫ్‌’ సంస్థకు సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు.

సామాజిక కార్యకర్త, చిప్కో, సర్వోదయ ఉద్యమాల నేత మురారి లాల్‌ (91) 2024, ఏప్రిల్‌ 12న రుషికేశ్‌లోని ఎయిమ్స్‌లో మరణించారు. చిప్కో ఉద్యమ మాతృసంస్థ అయిన దశోలీ గ్రామ స్వరాజ్య మండల్‌కు లాల్‌ అధ్యక్షుడు. ఆయన తన స్వగ్రామంలోని బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడంతోపాటు సహజ వనరుల సంరక్షణ, వినియోగానికి సంబంధించి వినూత్న విధానాలను రూపొందించి గుర్తింపు పొందారు.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని