కరెంట్‌ అఫైర్స్‌

భారత పురావస్తు శాఖ ‘విలేజ్‌ టు విలేజ్‌’ ప్రాజెక్ట్‌ కింద అనేక ప్రాంతాల్లో తొమ్మిదేళ్ల పాటు చేపట్టిన తవ్వకాల్లో ఎన్ని వారసత్వ అవశేషాలు బయటపడినట్లు భారత పురావస్తు శాఖ తాజా నివేదిక వెల్లడించింది?

Published : 15 Apr 2024 00:55 IST

మాదిరి ప్రశ్నలు

భారత పురావస్తు శాఖ ‘విలేజ్‌ టు విలేజ్‌’ ప్రాజెక్ట్‌ కింద అనేక ప్రాంతాల్లో తొమ్మిదేళ్ల పాటు చేపట్టిన తవ్వకాల్లో ఎన్ని వారసత్వ అవశేషాలు బయటపడినట్లు భారత పురావస్తు శాఖ తాజా నివేదిక వెల్లడించింది? (ఈ తవ్వకాల్లో ప్రాచీన ఆలయాల   ఆనవాళ్లు, మసీదులు, సమాధులు, చోళుల కాలం నాటి శాసనాలు, పలు రకాల శిలాజాలు వెలుగు చూశాయి. వీటిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పరిరక్షించేందుకు హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో దేశంలోనే మొదటి డిజిటల్‌ పురాతన శాసనాల అధ్యయన కేంద్రం ఏర్పాటుకు ఇటీవల శ్రీకారం చుట్టారు. ఇందులో లక్ష వరకు ప్రాచీన శాసనాలను భద్రపరిచే వీలుంది.)

జ: 3,100


ఏ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని ఇటీవల నిర్ణయించారు? (విద్యార్థుల పై చదువుల ఒత్తిడిని తగ్గించాలన్న నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పుస్తకాలు చూసి పరీక్షలు రాసే (ఓపెన్‌ బుక్‌) పద్ధతిని ఈ ఏడాది కొన్ని ఎంపిక చేసిన డపాఠశాలల్లో తొమ్మిది నుంచి పన్నెండో తరగతుల వరకు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. పది, పన్నెండో తరగతుల బోర్డు పరీక్షల్లో మాత్రం ఈ విధానం ఉండదని వెల్లడించింది.)

జ: 2025-26


ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ ప్రకటనల్లో నటించవద్దని సెలబ్రిటీలను సీసీపీఏ ఇటీవల హెచ్చరించింది. సీసీపీఏ పూర్తి రూపం ఏమిటి? (వాటికి ప్రచారం చేస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లేనని స్పష్టం చేసింది. పబ్లిక్‌ గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌ - 1867 కింద బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌లు పూర్తిగా నిషేధమని, అందువల్ల వీటిని దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలుగానే గుర్తిస్తున్నట్లు పేర్కొంది.)

జ: సెంట్రల్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని