కరెంట్‌ అఫైర్స్‌

అత్యంత ప్రతిష్ఠాత్మక ఐఏఏ (ఇంటర్నేషనల్‌ అడ్వర్టైజింగ్‌ అసోసియేషన్‌) గోల్డెన్‌ కంపాస్‌ అవార్డును గెలుచుకున్న భారతీయుడు ఎవరు? (మలేసియాలోని పెనాంగ్‌లో జరిగిన 45వ ఐఏఏ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

Published : 16 Apr 2024 00:36 IST

మాదిరి ప్రశ్నలు

అత్యంత ప్రతిష్ఠాత్మక ఐఏఏ (ఇంటర్నేషనల్‌ అడ్వర్టైజింగ్‌ అసోసియేషన్‌) గోల్డెన్‌ కంపాస్‌ అవార్డును గెలుచుకున్న భారతీయుడు ఎవరు? (మలేసియాలోని పెనాంగ్‌లో జరిగిన 45వ ఐఏఏ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రపంచ వేదికపై మార్కెటింగ్‌, అడ్వర్టైజింగ్‌, మీడియా  పరిశ్రమలకు విశేష సేవలు అందించే వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. భారతీయ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఈ అవార్డును గెలుచుకోవడం ఇదే తొలిసారి.)

జ: శ్రీనివాసన్‌ స్వామి


2023లో మూడు శాతంగా ఉన్న ప్రపంచ జీడీపీ వృద్ధిరేటు 2024లో ఎంత శాతానికి తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఇటీవల హెచ్చరించింది? (సంపన్న దేశాల్లో ఆర్థిక వృద్ధి మందకొడిగా, వర్ధమాన దేశాల్లో వేగంగా సంభవిస్తుందని ఐఎంఎఫ్‌ వివరించింది. ప్రపంచ దేశాలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడం, ఉపాధి  అవకాశాలు క్షీణించడం ఆర్థిక మాంద్యానికి సంకేతాలు. సంపన్న దేశాల్లో ఉపాధి అవకాశాలు, ఫైనాన్షియల్‌ మార్కెట్లు భారీగా కుదించుకుపోతాయని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.)

జ: 2.9 శాతం


అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 2024, మార్చి 8న ఏ థీమ్‌తో నిర్వహించారు?

జ: ఇన్వెస్ట్‌ ఇన్‌ ఉమెన్‌: యాక్సిలరేట్‌ ప్రోగ్రెస్‌  (మహిళలపై పెట్టుబడి పెట్టండి: పురోగతిని వేగిర పరచండి.)


దేశంలోని రైతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీని కింద సహకార రంగంలో వచ్చే అయిదేళ్లలో రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంత మొత్తం ఆహార ధాన్యాల నిల్వకు గిడ్డంగులు, ఇతర వసతులను సమకూర్చాలని సంకల్పించారు? (భారత్‌లో 13 కోట్ల మంది సభ్యులతో లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు (పీఏసీఎస్‌లు) ఉన్నాయి. వాటి పరిధిలో వికేంద్రీకృత గిడ్డంగులను నెలకొల్పాలని కేంద్రం కొత్తగా చేపడుతున్న ఈ పథకం లక్షిస్తోంది. ఈ పథకం కింద 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పీఏసీఎస్‌ల స్థాయిలో గిడ్డంగులు, ప్రాసెసింగ్‌ యూనిట్ల్ల లాంటివి ఏర్పాటు చేస్తారు. ఈ పథకం ఆహార భద్రతకు, అన్నదాతల ఆదాయాల పెంపునకు దోహద పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.)

జ: 7 కోట్ల టన్నులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని