యాలకుల కొండల్లో ఎత్తయిన శిఖరం దేవరమల్లి!

ప్రపంచంలోనే అత్యంత భౌగోళిక వైవిధ్యం ఉన్న దేశం భారత్‌. ఎత్తయిన పర్వతాలు, సారవంతమైన విశాల మైదానాలు, పెద్ద ఎడారి, త్రిభుజాకారంలో కఠిన శిలలతో కూడిన పీఠభూమి, సుదీర్ఘమైన సముద్ర తీరాలు, పురాతన కనుమలు, వందలాది చిన్న, పెద్ద నదులు, వాటి డెల్టాలు, సరస్సులు, జలపాతాలు ఇలా ఎన్నో భౌగోళిక స్వరూపాలున్నాయి.

Published : 17 Apr 2024 00:44 IST

టీఆర్‌టీ 2024 జాగ్రఫీ

ప్రపంచంలోనే అత్యంత భౌగోళిక వైవిధ్యం ఉన్న దేశం భారత్‌. ఎత్తయిన పర్వతాలు, సారవంతమైన విశాల మైదానాలు, పెద్ద ఎడారి, త్రిభుజాకారంలో కఠిన శిలలతో కూడిన పీఠభూమి, సుదీర్ఘమైన సముద్ర తీరాలు, పురాతన కనుమలు, వందలాది చిన్న, పెద్ద నదులు, వాటి డెల్టాలు, సరస్సులు, జలపాతాలు ఇలా ఎన్నో భౌగోళిక స్వరూపాలున్నాయి. రాష్ట్రాల వారీగా ప్రత్యేక సాంస్కృతిక, వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. ఇంతటి భిన్నత్వం ఉట్టిపడుతున్న దేశ నైసర్గిక స్వరూపంపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. ఇక్కడి ప్రధాన శిఖరాలు, కనుమ దారులు, ప్రసిద్ధ కొండలు, రాష్ట్రాల వారీగా భౌగోళికంగా, చారిత్రకంగా విశిష్టతలున్న నగరాలు, పట్టణాలు, ప్రాంతాలవారీ భౌగోళిక విశేషాల గురించి తెలుసుకోవాలి.

భారతదేశం - నైసర్గిక స్వరూపం

1. కిందివాటిలో ఏ శిఖరాన్ని వైట్‌ మౌంటెన్‌ అంటారు?

1) మకాలు
2) ధవళగిరి
3) కాంచనగంగ
4) చావోయి

2. కిందివాటిలో వేటి సాగుకు కారేవాస్‌ మృత్తికలు సహకరిస్తాయి?

1) తమలపాకు 2) ఎబోని 3) గంధం 4) కంకుమపువ్వు

3. కింది ఏ నది షిప్కిల కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది?

1) సింధూ  2) సట్లెజ్‌   3) చీనాబ్‌   4) కోసి

4. జమ్ము, శ్రీనగర్‌లను కలిపే కనుమ ఏది?

1) బనిహల్‌  2) జోజిల  3) షిప్కిల  4) నిదిలా

5. కిందివాటిలో హిమాచల్‌ప్రదేశ్‌లోని కనుమలు గుర్తించండి.

ఎ) బారాలాచా ల బి) షిప్కిల సి) జోజిల డి) నిదిల
1) ఎ, సి   2) సి, డి   3) ఎ, బి   4) బి, డి

6. ఎడారి ప్రాంతాల్లోని గట్టి శిలా పీఠభూముల్ని ఏమని పిలుస్తారు?

1) బార్కన్స్‌  2) హమడాలు  3) ప్లయా  4) సైప్‌

7. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ రాగి గనులున్న ఖేత్రి ప్రాంతం కింది ఏ కొండల్లో ఉంది?

1) మార్వార్‌ 2) అభు 3) ఆల్వార్‌ 4) భోరట్‌ పీఠభూమి

8. ఆరావళి పర్వతాల్లోని ఎత్తయిన శిఖరం గురుశిఖర్‌ కింది ఏ కొండల్లో భాగం?

1) అభూ కొండలు 2) మార్వార్‌ కొండలు
3) ఆల్వార్‌ కొండలు 4) జర్గా కొండలు

9. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌, సిరోహిలను  కలిపే  కనుమ?

1) హల్దీఘాట్‌ 2) పిప్లీఘాట్‌ 3) గోరన్‌ఘాట్‌  4) చార్‌ఘాట్‌

10. కిందివాటిలో ఏ పీఠభూమిలో పలమౌ జాతీయపార్కు ఉంది?

1) మాల్వా పీఠభూమి 2) చోటానాగ్‌పుర్‌ పీఠభూమి
3) దక్కన్‌ పీఠభూమి  4) షిల్లాంగ్‌ పీఠభూమి

11. కిందివాటిలో ఏ కొండల్లో మలయగిరి శిఖరం ఎత్తయినదిగా ఉంది?

1) గర్‌జాట్‌ కొండలు 2) రాజ్‌పిప్లా కొండలు
3) మైకాల కొండలు 4) గవిల్‌ఘర్‌ కొండలు

12. ‘డోర్‌వే ఆఫ్‌ డెక్కన్‌’గా పిలిచే అసిర్‌ఘర్‌ కనుమ కింది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?

1) వింధ్య పర్వతాలు 2) అజంతా పర్వతాలు
3) సాత్పురా పర్వతాలు 4) నీలగిరి పర్వతాలు

13. కిందివాటిలో మహారాష్ట్రలో ఎత్తయిన శిఖరం ఏది?

1) సాల్హేర్‌        2) కల్సూభాయి
3) మహాబలేశ్వర్‌ 4) హరిశ్చంద్రగఢ్‌

14. కిందివాటిలో వేటిని ఏనుగు పర్వతాలు అని కూడా పిలుస్తారు?

1) నీలగిరి   2) అన్నామలై  
3) పళని కొండలు   4) సహ్యాద్రి కొండలు

15. కిందివాటిలో ఏ కొండల్లో వందరావు శిఖరం ఎత్తయినదిగా ఉంది?

1) యాలకుల కొండలు   2) అన్నామలై  3) పళని కొండలు   4) నీలగిరి

16. కేరళలోని పాలక్కాడ్‌ను, తమిళనాడులోని కోయంబత్తూర్‌ను కలుపుతున్న కనుమ?

1) పాల్‌ఘాట్‌   2) భోర్‌ఘాట్‌  
3) థాల్‌ ఘాట్‌   4) నానేఘాట్‌

17. యాలకుల కొండల్లో ఎత్తయిన శిఖరం ఏది?

1) దొడబెట్ట 2) దేవరమల్లి
3) వందరావు   4) కల్సూభాయి

18. తలకోన జలపాతం కింది ఏ కొండల్లో ఉంది?

1) పాలకొండలు   2) నగరి కొండలు  
3) వెలికొండలు   4) శేషాచలం కొండలు

19. రాధానగర్‌ బీచ్‌ కింది ఏ ప్రాంతంలో ఉంది?

1) లక్షద్వీప్‌   2) తమిళనాడు  
3) అండమాన్‌-నికోబార్‌ 4) అంధ్రప్రదేశ్‌

20. అగట్టి, బంగారం దీవులు కింది ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయి?

1) లక్షద్వీప్‌   2) తమిళనాడు  
3) అండమాన్‌-నికోబార్‌ 4) కర్ణాటక

21. సహ్యాద్రిపర్వత శ్రేణుల్లో  రెండో ఎత్తయిన శిఖరం?

1) కల్సూభాయి     2) సాల్హేర్‌
3) మహాబలేశ్వర్‌   4) హరిశ్చంద్రగఢ్‌

22. వేసవి విడిది ప్రాంతమైన కొడైకెనాల్‌ కింది ఏ కొండల్లో ఉంది?

1) యాలకులు 2) నీలగిరి 3) పళని 4) అన్నామలై

23. నోక్రేక్‌ శిఖరం కింది ఏ కొండల్లో ఉంది?

1) గారో  2) ఖాసి  3) జయంతియ  4) మికిర్‌

24. మాసిన్రమ్‌, చిరపుంజి ప్రాంతాలు ఏ కొండల్లో ఉన్నాయి?

1) గారో  2) జయంతియ  3) ఖాసి  4) మికిర్‌

25. రాజస్థాన్‌లోని ముఖ్యమైన సరస్సుల్లో నక్కి సరస్సు కింది ఏ కొండల్లో ఉంది?

1) మార్వార్‌         2) ఆల్వార్‌  
3) అభూ కొండలు   4) భోరట్‌ పీఠభూమి

26. సాంబార్‌, రామ్‌ఘర్‌ సరస్సులు రాజస్థాన్‌లోని కింది ఏ కొండల్లో ఉన్నాయి?

1) అల్వార్‌ 2) మార్వార్‌ 3) అభూ 4) జర్గా కొండలు

27. మండి జలవిద్యుత్‌ కేంద్రం కింది ఏ రాష్ట్రంలో ఉంది?

1) బిహార్‌ 2) హిమాచల్‌ ప్రదేశ్‌
3) ఉత్తర్‌ప్రదేశ్‌ 4) సిక్కిం

28. కిందివాటిలో ఏ కనుమ పాకిస్థాన్‌ను అఫ్గానిస్థాన్‌తో కలుపుతుంది?

1) కిలిక్‌   2) బోలన్‌   3) ఖైబర్‌   4) దోరహ్‌

29. కిందివాటిలో అఫ్గానిస్థాన్‌, చైనా మధ్య ఉన్న కనుమను గుర్తించండి.

1) బోలన్‌   2) కిలిక్‌   3) దోరహ్‌   4) వఖ్జీర్‌

30. కిందివాటిలో శ్రీనగర్‌, లేహ్‌లను కలిపే కనుమ ఏది?

1) బనిహల్‌ 2) జోజిల 3) బుర్జిల్‌  4) ఆఘిల్‌

31. ఏ కనుమను ‘గేట్‌ వే ఆఫ్‌ శ్రీనగర్‌’ అని పిలుస్తారు?

1) జోజిల 2) బుర్జిల్‌
3) బనిహల్‌ 4) ఖర్దుంగ్‌లా

32. ట్రాన్స్‌ హిమాలయాలను పాకిస్థాన్‌లో ఏమని పిలుస్తారు?

ఎ) సులేమాన్‌ బి) కిర్తాహర్‌ సి) కారకోరం డి) కుక్‌లున్‌
1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ

33. కింది ఏ రాష్ట్రంలో మన్రో దీవి ఉంది?

1) కర్ణాటక 2) కేరళ
3) తమిళనాడు 4) పశ్చిమ బెంగాల్‌

34. ట్రాన్స్‌ హిమాలయాలను చైనాలో ఏమని పిలుస్తారు?

1) టైన్‌షాన్‌ 2) కైలాస్‌ 3) సులేమాన్‌ 4) జస్కర్‌

35. కిందివాటిలో మాల్వా పీఠభూమిలో ఎత్తయిన శిఖరాన్ని గుర్తించండి.

1) పావ్‌గడ్‌ 2) సిగర్‌ 3) దూప్‌ఘర్‌ 4) ములంగీర్‌

36. కిందివాటిలో సిక్కింలోని ముఖ్యమైన కనుమలు గుర్తించండి.

ఎ) నాథులా బి) జలెప్‌లా
సి) దీవు కనుమ ఇ) నితిలా
1) ఎ, బి   2) బి, సి   3) డి   4) డి, ఎ

37. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన భీంబెట్కా గుహలు కింది ఏ పర్వతాల్లో ఉన్నాయి?

1) సాత్పురా   2) వింధ్య
3) అజంతా   4) ఆరావళి

38. కిందివాటిలో దేన్ని భారతదేశంలో శీతల ఎడారిగా పిలుస్తారు?

1) జైసల్మేర్‌ ఎడారి 2) థార్‌ ఎడారి
3) లద్దాఖ్‌ ఎడారి 4) రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ఎడారి

39. కిందివాటిలో సున్నపురాయి నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన శిలలను గుర్తించండి.

ఎ) కడప శిల   బి) రాజమండ్రి శిల  
సి) కర్నూలు శిల   డి) గోండ్వానా శిల
1) ఎ, బి     2) బి, సి     3) సి, ఎ    4) సి, డి

40. కిందివాటిలో ఏ కనుమ తమిళనాడులోని మధురై, కేరళలోని కొల్లాంలను కలుపుతుంది?

1) పాల్‌ఘాట్‌   2) బోర్‌ఘాట్‌  
3) షెన్‌కొట్టి   4) దాల్‌ఘాట్‌

41. సహ్యాద్రి పర్వతాల్లో (మహారాష్ట్ర) రెండో ఎత్తయిన శిఖరాన్ని గుర్తించండి.

1) కల్సూభాయి   2) మహాబలేశ్వర్‌  
3) హరిశ్చంద్రగఢ్‌   4) సాల్హేర్‌

42. కిందివాటిలో చమురు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందిన శిలలను గుర్తించండి.

1) కడప శిల   2) గోండ్వానా శిల  
3) రాజమండ్రి శిల   4) కర్నూలు శిల

43. ప్రతిపాదన (A): భారతదేశంలోని పశ్చిమతీర మైదానాల్లో డెల్టాలు ఏర్పడటం కనిపించదు.

కారణం (B): భారతదేశపు పశ్చిమతీర మైదానాలు తూర్పుతీర మైదానాల కంటే విస్తృతమైనవి.

1) A, R రెండూ సరికావు, Aకు R సరైన వివరణ కాదు.
2) A, R రెండూ సరికావు, కానీ Aకు R సరైన వివరణ.
3) A సరికాదు, R సరైంది.
4) A సరైంది, R సరికాదు.

44. కిందివాటిలో ఏ నగరాన్ని సిటీ ఆఫ్‌ సెవెన్‌ ఐలాండ్స్‌గా పిలుస్తారు?

1) చండీగఢ్‌   2) ముంబయి  
3) కోల్‌కతా   4) బెంగళూరు

45. కిందివాటిలో ఏ ప్రాంతాన్ని ఆరెంజ్‌ సిటీ అంటారు?

1) బెంగళూరు 2) జైపుర్‌
3) నాగ్‌పుర్‌   4) ఉదయ్‌పుర్‌

46. ఏ రాష్ట్రాన్ని లాండ్‌ ఆఫ్‌ టెంపుల్స్‌గా పిలుస్తారు?

1) కేరళ          2) ఉత్తరాఖండ్‌  
3) తమిళనాడు    4) ఒడిశా

47. ప్రపంచంలో మూడో ఎత్తయిన శిఖరం గుర్తించండి.

1) K2   2) కాంచనగంగా 3) అన్నపూర్ణ 4) మకాలు

48. కైబర్‌, బోలాన్‌ కనుమలు కింది ఏ హిమాలయాల్లో ఉన్నాయి?

1) హిమాద్రి              2) హిమాచల్‌  
3) ట్రాన్స్‌ హిమాలయాలు 4) పూర్వాంచల్‌

49. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ దిల్వారా జైన దేవాలయం కింది ఏ కొండల్లో ఉంది?

1) అభు కొండలు   2) మార్వార్‌ కొండలు  
3) జర్గా కొండలు   4) అల్వార్‌ కొండలు

50. కింది ఏ రాష్ట్రంలో కుప్పడ్‌ బీచ్‌ ఉంది?

1) తమిళనాడు   2) కేరళ  
3) కర్ణాటక      4) ఒడిశా

సమాధానాలు

1-2; 2-4; 3-2; 4-1; 5-3; 6-2; 7-3; 8-1; 9-3; 10-2; 11-1; 12-3; 13-2; 14-2; 15-3; 16-1; 17-2; 18-4; 19-3; 20-1; 21-2; 22-3; 23-1; 24-3; 25-3; 26-1; 27-2; 28-4; 29-4; 30-2; 31-3; 32-1; 33-2; 34-1; 35-2; 36-1; 37-2; 38-3; 39-3; 40-3; 41-4; 42-3; 43-4; 44-2; 45-3; 46-3; 47-2; 48-3; 49-1; 50-2.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని