ప్రాక్టీస్‌ బిట్లు

1. భారతదేశం సహా  ప్రపంచంలో మొదటగా నిర్మూలించిన వ్యాధి?

Published : 18 Apr 2024 00:51 IST

జనరల్‌ స్టడీస్‌ - బయాలజీ

1. భారతదేశం సహా  ప్రపంచంలో మొదటగా నిర్మూలించిన వ్యాధి?
1) మశూచి  2) కలరా 3) టైఫాయిడ్‌ 4) డయేరియా

2. వైరస్‌ వల్ల కలిగే ఏ వ్యాధిని భారతదేశంలో నివారించారు?
1) డెంగీ   2) రేబిస్‌  3) పోలియో   4) క్షయ

3. ఔషధ నిరోధక క్షయ చికిత్స కోసం ఏ ఔషధాలను ఇస్తున్నారు?
1) క్వినైన్‌, పెన్సిలిన్‌    2) బెడాక్విలైన్‌, డెలాయానిడ్‌
3) అశ్వగంధ, క్వినైన్‌   4) పెరిథ్రమ్‌, అమాక్సిల్లిన్‌

4. లైపోజోమల్‌ ఆంఫోటెరిసిన్‌-బి అనే ఔషధాన్ని ఏ వ్యాధి చికిత్స కోసం వాడుతున్నారు?
1) మలేరియా 2) ఫైలేరియా 3) కాలా అజార్‌ 4) డయేరియా

5. ఫైలేరియాసిస్‌ లేదా బోదకాలు వ్యాధి ఏ వాహకం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది?
1) ఆడ ఎనాఫిలస్‌ దోమ 2) మగ ఎనాఫిలస్‌ దోమ  
3) శాండ్‌ ఫ్లై       4) ఆడ క్యూలెక్స్‌ దోమ

6. ఏ జన్యు సంబంధ రోగులను తగ్గించడానికి జాతీయ స్థాయిలో మిషన్‌ ప్రారంభించారు?
1) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ 2) సికిల్‌సెల్‌ ఎనీమియా
3) సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌ 4) న్యూట్రిషనల్‌ ఎనీమియా

7. కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ) థైరాక్సిన్‌ హార్మోన్‌లో అయోడిన్‌ ఉంటుంది.
బి) థైరాక్సిన్‌.. ట్రై అయడో థైరోనిన్‌ (గి3), టెట్రా అయడో థైరోనిన్‌ (గి4) రూపాల్లో ఉంటుంది.
సి) థైరాక్సిన్‌ ఆధార జీవక్రియ రేటును నియంత్రిస్తుంది.
డి) థైరాక్సిన్‌ లోపం వల్ల చిన్నపిల్లల్లో క్రిటినిజమ్‌ వ్యాధి కలుగుతుంది.
1) ఎ, బి 2) సి, డి 3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి

8. థైరాయిడ్‌ గ్రంథి స్రవించే థైరోకాల్సిటోనిన్‌ విధి?
ఎ) ఎముకల్లో క్యాల్షియం స్థాపనను పెంచుతుంది.
బి) రక్తంలో క్యాల్షియం స్థాయిని తగ్గిస్తుంది.
సి) మూత్రం ద్వారా వెళ్లే క్యాల్షియాన్ని పెంచుతుంది.
1) ఎ    2) బి    3) ఎ, బి, సి    4) బి, సి

సమాధానాలు: 1-1; 2-3; 3-2; 4-3; 5-4; 6-2; 7-4, 8-3.


Current Affairs

Singapore Prime Minister Lee Hsien Loong (72) will step down on May 15 as part of a long-planned succession. Deputy Prime Minister Wong (51) will become the fourth PM of Singapore on the same day.

F Lee was sworn in as Singapore's third Prime Minister on August 12, 2004.


The 5th edition of India- Uzbekistan joint military Exercise DUSTLIK started at Termez, the Republic of Uzbekistan on 15 April 2024. This exercise will be held until  28 April 2024. DUSTLIK is a yearly event conducted alternatively in India and Uzbekistan. Last edition was conducted at Pithoragarh (India) in February 2023.


Kristalina Georgieva was re-appointed as the Managing Director (MD) of the International Monetary Fund (IMF) for a second 5-year term. Her tenure will start from 1 October 2024. She has been serving as IMF's MD since October 1, 2019.


BharatPe said it has appointed its interim CEO and CFO Nalin Negi as full-time Chief Executive Officer (CEO) on 16 April 2024. Negi was given charge of interim CEO in January 2023.


Kuwait’s Emir has appointed Sheikh Ahmad Abdullah al-Ahmad al-Sabah as the new Prime Minister of the country on 16 April 2024. This decision follows the resignation of former Prime Minister Sheikh Mohammad Sabah Al-Salem Al-Sabah on April 7.

For E-books (EM/TM): Scan QR Code


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని