కరెంట్‌ అఫైర్స్‌

అలెగ్జాండర్‌ స్టబ్‌ ఇటీవల ఏ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? (ఈయన 2014 -15లో ఈ దేశ ప్రధాన మంత్రిగా పని చేశారు.)

Published : 19 Apr 2024 00:46 IST

మాదిరి ప్రశ్నలు

అలెగ్జాండర్‌ స్టబ్‌ ఇటీవల ఏ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? (ఈయన 2014 -15లో ఈ దేశ ప్రధాన మంత్రిగా పని చేశారు.)

జ: ఫిన్లాండ్‌


2024 నాటికి మొత్తం ఎంత మంది ప్రముఖులకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రకటించారు? (2024లో ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని మొత్తం అయిదుగురికి ప్రకటించారు. వీరిలో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్‌, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్‌.కె. అడ్వాణీ, మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్‌ సింగ్‌, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌. స్వామినాథన్‌లు ఉన్నారు. ఇప్పటి వరకు మన దేశానికి 14 మంది పూర్తి స్థాయి ప్రధాన మంత్రులుగా సేవలు అందించారు. వారిలో 8 మంది భారత రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. జవహర్‌లాల్‌ నెహ్రూ (1955), లాల్‌ బహదూర్‌శాస్త్రి (1966 - మరణానంతరం), ఇందిరా గాంధీ (1971), రాజీవ్‌ గాంధీ (1991 - మరణానంతరం), మొరార్జీ దేశాయ్‌ (1991), వాజ్‌పేయీ (2015)లకు గతంలోనే ఈ అవార్డు దక్కింది.)

జ: 53


2023, ఫిబ్రవరి నుంచి 2024 జనవరి వరకు ఏడాది మొత్తం భూ సగటు ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదైనట్లు యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీసు (సీ3ఎస్‌) వెల్లడించింది? (1850-1900 నాటి ఉష్ణోగ్రతల సగటుతో పోలిస్తే ఏడాది పొడవునా ఇన్ని డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి అని సీ3ఎస్‌ పేర్కొంది. 2024, జనవరి అత్యంత వేడి జనవరిగా రికార్డుకెక్కిందని అది వివరించింది. 1850-1900 నాటి కంటే ఈ జనవరిలో 1.66 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.)

జ: 1.52 డిగ్రీలుTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని