నోటిపికేషన్స్‌

న్యూదిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ (పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌)లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) 2024 పరీక్ష నిర్వహిస్తోంది.

Published : 20 Apr 2024 01:06 IST

అడ్మిషన్స్‌
నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) - పీజీ 2024

న్యూదిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ (పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌)లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) 2024 పరీక్ష నిర్వహిస్తోంది.

అర్హత: ఎంబీబీఎస్‌ డిగ్రీ/ ప్రొవిజనల్‌ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి.

పరీక్ష రుసుము: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.3500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.2500.

పరీక్షా విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. దీనికి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 రుణాత్మక మార్కు ఉంటుంది. పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో జరుగుతుంది. ఈ పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 6 మే 2024.

పరీక్ష తేదీ: 23 జూన్‌ 2024.

వెబ్‌సైట్‌: https://natboard.edu.in/


ఎన్‌టీఏ - నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించే నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎన్‌సీఈటీ) 2024 నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఐటీఈపీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు పొందవచ్చు.

నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐటీఈపీ) 2024

కోర్సులు: బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ.

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

వయోపరిమితి: అభ్యర్థులకు వయోపరిమితి లేదు.

సంస్థలు, సీట్ల వివరాలు: ఎన్‌సీఈటీ స్కోరు ఆధారంగా జాతీయ స్థాయిలో 64 వివిధ వర్సిటీలు/ ఆర్‌ఐఈ/ ఎన్‌ఐటీలు/ ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఈ సంస్థల్లో 6100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో ఉర్దూ వర్సిటీ (150 సీట్లు), వరంగల్‌ ఎన్‌ఐటీ (50), లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (50)లో సీట్లు ఉన్నాయి.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష ఇంగ్లిష్‌, హిందీతో పాటు 13 భాషల్లో జరుగుతుంది.

దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్థులకు రూ.1200; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులకు రూ.650.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2024.

పరీక్ష తేది: 12 జూన్‌ 2024.

వెబ్‌సైట్‌: https://ncet./~amarth.ac.in/index.php//~ite/index

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని