మానవాళి ఆరోగ్యాన్ని హరించే ‘డర్టీడజన్స్‌’!

ప్రగతి పేరుతో విచక్షణారహితంగా, విచ్చలవిడిగా సహజ వనరులను వినియోగించడం ప్రమాదకరం. భవిష్యత్తు  అవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. పునరుత్పాదక పద్ధతులను అవలంబిస్తూ తర్వాతి తరాలకు వనరులను అందించేందుకు జాగ్రత్త వహించాలి.

Published : 20 Apr 2024 01:26 IST

జనరల్‌ స్టడీస్‌ పర్యావరణం పరిరక్షణ

ప్రగతి పేరుతో విచక్షణారహితంగా, విచ్చలవిడిగా సహజ వనరులను వినియోగించడం ప్రమాదకరం. భవిష్యత్తు  అవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. పునరుత్పాదక పద్ధతులను అవలంబిస్తూ తర్వాతి తరాలకు వనరులను అందించేందుకు జాగ్రత్త వహించాలి. ఆ విధంగా ప్రజలందరి కనీస అవసరాలను తీర్చగలిగే తీరులో పురోగతి విధానాలను రూపొందించుకోవడమే సుస్థిరాభివృద్ధి ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇదొక నినాదంగా మారింది. దీనికి సంబంధించిన భావనలను, నిర్వచనాలను, జరిగిన సదస్సులు, తీర్మానాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలి.

సుస్థిరాభివృద్ధి

1983లో యూఎన్‌ఓ ఆధ్వరంలో నార్వే ప్రధాని బ్రంట్‌ ల్యాండ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘పర్యావరణం అభివృద్ధి’ అనే సదస్సులో పర్యావరణ వేత్తలు తరచూ వాడే ‘సుస్థిరాభివృద్ధి’ అనే భావనను పర్యావరణ సమస్యలను ఎదుర్కొనే ఉద్దేశంతో అభివృద్ది స్థానంలో ‘సుస్థిరాభివృద్ధి అనే నూతన భావనను ప్రవేశపెట్టారు. ఈ నివేదికను ‘మన ఉమ్మడి భవిష్యత్తు’ అనే పేరుతో 1987లో ఆమోదించగా, 1988 నుంచి అమల్లోకి వచ్చింది.

బ్రంట్‌ ల్యాండ్‌ నిర్వచనం ప్రకారం.. ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ, భవిష్యత్తు తరాలకు వనరులను మిగిల్చేలా, వాటిని వివేకవంతంగా వినియోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధిని ‘సుస్థిరాభివృద్ధి’ అంటారు.  

1. సుస్థిరాభివృద్ధి అనే భావనను మొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1983   2) 1987   3) 1988   4) 1999

2. యూఎన్‌ఓ ఆధ్వర్యంలో మొదటిసారిగా ‘వరల్డ్‌  కమిషన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ సదస్సు ఎప్పుడు నిర్వహించారు?

1) 1983   2) 1987   3) 1988   4) 1999

3. బ్రంట్‌ ల్యాండ్‌ కమిషన్‌ కిందివాటిలో దేనికి  సంబంధించింది?

1) నిరంతర అభివృద్ధి 2) అభివృద్ధి
3) సుస్థిరాభివృద్ధి     4) అస్థిరాభివృద్ధి

4. ‘సుస్థిరాభివృద్ధి’ అనే భావనను ఎప్పుడు ఆమోదించారు?

1) 1983   2) 1987   3) 1988   4) 1999

5. ‘సుస్థిరాభివృద్ధి’ అనే భావన అమల్లోకి వచ్చిన సంవత్సరం?

1) 1983   2) 1987   3) 1988   4) 1999

6. సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఇచ్చిన ప్రవచనాలను పరిశీలించి, సరైన వాటిని గుర్తించండి.

ఎ) ప్రస్తుత అవసరాలను తీర్చుకునే విధంగా    వనరులను వినియోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధి.
బి) భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చే విధంగా వనరులను వినియోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధి.
సి) ప్రస్తుత తరాల అవసరాలను, వనరులను ఏ రేటులో వినియోగించుకుంటామో అదే రేటులో వాటిని పునరుత్పత్తి చెందించడం ద్వారా భవిష్యత్తు తరాలకు కూడా వనరులు అందుబాటులో ఉండే విధంగా సాధించే అభివృద్ధి.

1) ఎ, సి  2) బి, సి 3) సి మాత్రమే 4) ఏదీకాదు

7. సుస్థిరాభివృద్ధికి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి.

ఎ) వనరులను వాటి పునరుత్పాదక శక్తికి మించి  వినియోగించరాదు.
బి) పునరుత్పత్తి చెందని ఇంధన వనరుల స్థానంలో పునరుత్పత్తి చెందే, కాలుష్య రహితమైన     వనరులను వినియోగించాలి.
సి) పర్యావరణం విలీనం చేసుకోగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్యక పదార్థాలను పర్యావరణంలోకి విడుదల చేయకూడదు.
డి) అభివృద్ధి అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్ని వర్గాల ప్రజలకు కనీస అవసరాలను తీర్చేలా ఉండాలి.

1) ఎ, బి, సి     2) బి, సి, డి
3) ఎ, సి, డి     4) ఎ, బి, సి, డి

8. సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యతను యూఎన్‌ఓ ఆధ్వర్యంలో జరిగిన ఏ సమావేశంలో సూచించారు?

1) 2007 - బాలి సమావేశం
2) 1997 - క్యోటో ప్రొటోకాల్‌ సమావేశం
3) 2002 - జోహెన్నస్‌ బర్గ్‌ సమావేశం
4) 2009 - కోపెన్‌హెగెన్‌ సమావేశం

9. కిందివాటిలో ఎజెండా - 2030 గా దేన్ని పిలుస్తారు?

1) సహస్రాభివృద్ధి లక్ష్యాలు 2) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు
3) కాప్‌  16 సమావేశం    4) కాప్‌  17 సమావేశం

10. కిందివాటిలో సుస్థిరాభివృద్ధిని పెంపొందించని అభివృద్ధి కార్యక్రమం?

1) సేంద్రియ వ్యవసాయం
2) వాటర్‌షెడ్‌ నిర్వహణ
3) పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల వాడకం
4) రసాయన ఎరువుల వాడకం

11. భారతదేశంలో వ్యవసాయ విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం?

1) అస్సాం     2) సిక్కిం        
3) మణిపుర్‌   4) నాగాలాండ్‌

12. సేంద్రీయ వ్యవసాయ విధాన పితామహుడు-

1) నార్మన్‌ బోర్లాగ్‌     2) మైఖేల్‌ స్టీఫెన్స్‌
3) సర్‌ అల్బర్ట్‌ హూవార్డ్‌ 4) విలియం గాండే

13. దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే  నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ (ఎన్‌సీవోఎఫ్‌)పరిశోధనా కార్యాలయం ఎక్కడుంది?

1) ఘజియాబాద్‌ 2) గోరఖ్‌పుర్‌  
3) గుడ్‌గావ్‌      4) హిస్సార్‌

14. కిందివాటిలో నత్రజని ఎరువుల శాతాన్ని నేలలో పెంపొందించే బ్యాక్టీరియాలు?

1) రైజోబియం 2) అజటో బాక్టర్‌  
3) క్లాస్ట్రీడియం 4) పైవన్నీ

15. జీవ క్రిమిసంహారకాలకు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి.

ఎ) పర్యావరణ కాలుష్యాన్ని కలిగించవు.
బి) బయోమాగ్నిఫికేషన్‌ సమస్యలు ఉండవు.
సి) మృత్తికలోని ఉపయోగకరమైన వానపాములు, ఇతర సూక్ష్మజీవులు చనిపోతాయి
డి) ఇవి త్వరితంగా జీవవిచ్ఛిన్నం చెంది పంట మొక్కల పరిరక్షణకు అందుబాటులోకి వస్తాయి.
ఇ) రైతుకు వీటి వాడకం తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

1) ఎ, బి, సి, ఇ   2) ఎ, బి, డి, ఇ
3) ఎ, సి, డి, ఇ 4) ఎ, బి, సి, డి, ఇ

16. జీవ ఎరువులకు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి.

ఎ) నేల, నీటి కాలుష్యాలు నియంత్రణలో ఉంటాయి.
బి) యూట్రిఫికేషన్‌, బయో మాగ్నిఫికేషన్‌ సమస్యలు ఉండవు.
సి) ఇవి రైతుకు లాభాన్ని చేకూర్చే ఎరువులు.
డి) నేల సారవంతతను పెంపొందించి, సూక్ష్మజీవుల పరిరక్షణకు దోహదపడతాయి.
ఇ) దీర్ఘకాలికంగా జీవ ఎరువులను ఉపయోగించడం వల్ల సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుంది.

1) ఎ, బి, సి, ఇ     2) ఎ, బి, డి, ఇ
3) ఎ, సి, డి, ఇ     4) ఎ, బి, సి, డి, ఇ

17. ఆహార పదార్థాల నిల్వకు వాడే క్యాన్లకు జింక్‌తో కాకుండా టిన్‌తో ఎందుకు పూత పూస్తారు?

1) జింక్‌, టిన్‌ కంటే ఖరీదైంది.
2) టిన్‌ కంటే జింక్‌ ద్రవీభవన స్థానం ఎక్కువ.
3) టిన్‌ కంటే జింక్‌ ఎక్కువగా ప్రతిచర్యను   చూపుతుంది.
4) జింక్‌ కంటే టిన్‌ ఎక్కువగా ప్రతిచర్యను   చూపుతుంది.

18. ‘కాంటూర్‌ బండింగ్‌ విధానం’ దేని సంరక్షణ ప్రక్రియ?

1) వేగంగా వీచే పవనాల ప్రభావానికి లోనయ్యే ఎడారి సరిహద్దు ప్రాంతాలు.
2) ప్రవాహాలకు దగ్గరలో, వరద ప్రభావానికి లోనయ్యే సమతల మైదాన ప్రాంతాలు.
3) గడ్డి మొక్కలు పెరిగే చిట్టడవి ప్రాంతాలు.
4) ఏదీకాదు

19. జీవ ఎరువులకు సంబంధించి సరైనవి గుర్తించండి.

ఎ) అగారికస్‌ బి) నాస్టాక్‌  సి) స్పైరోగైరా
1) ఎ, సి   2) బి మాత్రమే  
3) బి, సి     4) సి మాత్రమే

20. యూఎన్‌ఓ ఆధ్వర్యంలో జరిగిన ఏ సుస్థిరాభివృద్ధి సదస్సులో మానవాళి ఆరోగ్యాన్ని హరించివేసే విష రసాయనాలను, పర్యావరణ నాణ్యతను  దెబ్బతీస్తూ తల్లి పాలలో సైతం చేరుతున్న ‘డర్టీ డజన్స్‌’గా పిలిచే 12 రకాల క్రిమిసంహారక మందులను నిషేధించాలని సదస్సు తీర్మానించింది?

1) 1983 - వియన్నా సదస్సు
2) 1987 - స్టాక్‌హోం సదస్సు
3) 1993 - క్యోటో సదస్సు
4)2002 - జోహెన్నస్‌ బర్గ్‌ సదస్సు

21. ఇటీవల ఆయిల్‌ జాఫర్‌ వార్తల్లో ప్రసిద్ధికెక్కింది. కారణం ఏమిటి?

1) చమురు తెట్టు, నురగను విక్షాళనం చెందించే పర్యావరణహిత సాంకేతిక పరిరక్షణా విధానం.
2) సముద్రాల్లో చమురు నిల్వలను గుర్తించే నవీన సాంకేతిక పరిజ్ఞానం.
3) ఇది జన్యుసాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొక్కజొన్న నుంచి తయారు చేసిన జీవ ఇంధనం.
4) చమురు బావుల్లో ఆకస్మికంగా చెలరేగే మంటలను ఆర్పడానికి అభివృద్ధిపరచిన నూతన సాంకేతిక విధానం.

22. కింది ప్రవచనాల్లో సరైనవాటిని గుర్తించండి.

ఎ) ప్రకృతి వైపరీత్యాలు, శీతోష్ణస్థితిలో కలిగే మార్పులు సుస్థిరాభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటివి.
బి) శీతోష్ణస్థితిలో మార్పులు... వ్యవసాయోత్పత్తి దిగుబడుల్లో, వ్యవసాయరంగంపై ఆధారపడి జీవనాధారాన్ని గడిపే సమాజంపై, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
1) ఎ   2) బి    3) ఎ, బి   4) ఏదీకాదు

23. బయో ఇథనాల్‌కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.

ఎ) దీన్ని చెరకు లేదా మొక్కజొన్న మొలాసిస్‌ నుంచి తయారు చేస్తారు.
బి) దీని నుంచి తయారు చేసే ఇథనాల్‌ను    పెట్రోల్‌తో కలిపి ప్రత్యామ్నాయ ఇంధనంగా  ఉపయోగిస్తున్నారు.
సి) దీన్నే గ్యాసోహాల్‌ అని కూడా పిలుస్తారు.
1) ఎ, బి   2) బి, సి  3) ఎ, సి  4) ఎ, బి, సి

24. బయోగ్యాస్‌కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.

ఎ) దీన్ని పశువుల పేడ, ఇతర వృక్ష సంబంధిత వ్యర్థ పదార్థాలతో తయారు చేస్తారు.
బి) బయోగ్యాస్‌లో 60% మీథేన్‌, 40% కార్బన్‌ డై ఆక్సైడ్‌లు ఉంటాయి.
సి) ఇది చవకైంది, కాలుష్య రహితమెంiది,     వంటగ్యాస్‌గా ఉపయోగిస్తారు.

1) ఎ, బి 2) బి, సి 3) సి మాత్రమే 4) ఎ, బి, సి

25. ‘వర్మికంపోస్టు’ అనేది ఒక....

1) నిరేంద్రియ ఎరువు     2) విష పదార్థం
3) సేంద్రియ జీవ ఎరువు 4) కృత్రిమ ఎరువు

26. బయో డీజిల్‌కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.

ఎ) జంతువుల కొవ్వు, వెజిటబుల్‌ ఆయిల్‌, మొక్కల భాగాల నుంచి తీసిన ముడి నూనెలను   ‘ట్రాన్స్‌-ఎస్టరిఫికేషన్‌’ చర్య ద్వారా బయోడీజిల్‌ను తయారు చేస్తారు.
బి) బయోడీజిల్‌ను పెట్రోల్‌ లేదా డీజిల్‌తో కలిపి ఇంధనంగా ఉపయోగిస్తారు.
సి) భారతదేశంలో గానుగ, జట్రోపా చెట్ల నుంచి దీన్ని తయారుచేస్తారు.
డి) భారత్‌ లాంటి ఇంధన కొరత దేశాల్లో ఇదొక కాలుష్య రహిత ఇంధన ఆదా విధానం.

1) ఎ, బి, డి  2) బి, సి, డి 3) సి, డి 4) ఎ, బి, సి, డి

27. ‘ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ,  భవిష్యత్తు తరాలకు వనరులను మిగిల్చేలా, వాటిని వివేకవంతంగా వినియోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధి - సుస్థిరాభివృద్ధి’ అని  నిర్వచించింది?

1) ప్రపంచ బ్యాంకు  
2) ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు
3) బ్రంట్‌ ల్యాండ్‌ కమిషన్‌
4) యూఎన్‌ఓ

సమాధానాలు

1-1; 2-1; 3-3; 4-2; 5-3; 6-3; 7-4; 8-3; 9-2; 10-4; 11-3; 12-3; 13-1; 14-4; 15-2; 16-4;  17-3; 18-2; 19-3; 20-4; 21-1; 22-3; 23-4;  24-4; 25-3; 26-4; 27-3.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని