నోటిఫికేషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2024 నోటిఫికేషన్‌ను ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసింది.

Published : 21 Apr 2024 00:41 IST

అడ్మిషన్స్‌

ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2024

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2024 నోటిఫికేషన్‌ను ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బీటెక్‌, బీసీఏ, బీబీఎం విద్యార్థులూ అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్టులనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్టులుగా ఎంచుకోవాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: ఎస్సీ/ ఎస్టీలకు రూ.450; బీసీలకు రూ.500; ఓసీలకు రూ.650.
ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 15 మే 2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 8 జూన్‌ 2024.
వెబ్‌సైట్‌:  https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx


ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌ - కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024

స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ 2024-25 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఓటీ, బీపీవో, బీఏఎస్‌ఎల్‌పీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ‘కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

1. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటర్‌ డిజేబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌), కోల్‌కతా (ఎన్‌ఏఎల్‌డీ)
2. స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌), కటక్‌
3. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజేబిలిటీస్‌ (ఎన్‌ఐఈపీఎండీ), చెన్నై
4. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ ఫిజికల్‌ డిజేబిలిటీస్‌ (పీడీయూఎన్‌ఐపీపీడీ), న్యూదిల్లీ
5. కంపోజిట్‌ రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, రిహాబిలిటేషన్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజేబిలిటీస్‌ (సీఆర్‌సీఎస్‌ఆర్‌ఈ), గువాహటి

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు, కోర్సు వ్యవధి వివరాలు:

1. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ): నాలుగేళ్లు, 6 నెలల ఇంటర్న్‌షిప్‌
2. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (బీవోటీ): నాలుగేళ్లు, 6 నెలల ఇంటర్న్‌షిప్‌
3. బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్రోస్థెటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ (బీపీవో): నాలుగేళ్లు, 6 నెలల ఇంటర్న్‌షిప్‌
4. బ్యాచిలర్‌ ఇన్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ (బీఏఎస్‌ఎల్‌పీ): నాలుగేళ్లు (ఏడాది ఇంటర్న్‌షిప్‌తో సహా)

మొత్తం సీట్ల సంఖ్య: 443
అర్హత: కనీసం 50% మార్కులతో పన్నెండో తరగతి/ 10+2 (సైన్స్‌ సబ్జెక్టులు- ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ/ మ్యాథమెటిక్స్‌) లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20 మే 2024
వెబ్‌సైట్‌: https://admission./~vnirtar.nic.in/Index/institute_index/ins/NIRTAR#


మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని