కరెంట్‌ అఫైర్స్‌

మిస్‌ వరల్డ్‌ - 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు?

Published : 17 May 2024 01:35 IST

మాదిరి ప్రశ్నలు

  • మిస్‌ వరల్డ్‌ - 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? (ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మిస్‌ వరల్డ్‌ - 2024 ఫైనల్స్‌ పోటీలను నిర్వహించారు. మిస్‌ వరల్డ్‌ పోటీలకు 28 ఏళ్ల తర్వాత భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది. రన్నరప్‌గా మిస్‌ లెబనాన్‌ యాస్మినా జెటౌన్‌ ఎంపికయ్యారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ముంబయి వాసి, ఫెమినా మిస్‌ ఇండియా సినిషెట్టి టాప్‌-8కి పరిమితమయ్యారు.)

జ: క్రిస్టినా పిస్కోవా, చెక్‌ రిపబ్లిక్‌

  • లోక్‌పాల్‌ కొత్త ఛైర్‌పర్సన్‌గా 2024, మార్చి 10న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? (రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.)

జ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ మాణిక్‌రావు ఖాన్విల్కర్‌

  • 2024, ఏప్రిల్‌ 4న ఏ అంతర్జాతీయ కూటమి తన 75 వసంతాల సంబరాలు చేసుకుంది? (1949, ఏప్రిల్‌ 4న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఈ అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేశారు. సోవియట్‌ సేనలకు వ్యతిరేకంగా దృఢమైన సైనిక కుడ్యం ఏర్పర్చడమే ప్రధాన ధ్యేయంగా ఈ కూటమిని ఏర్పాటు చేశారు. తమ కూటమి దేశాలు రోజూ పరస్పరం సంభాషించుకుంటాయని, పరిస్థితులను సమీక్షించుకుంటూ నిరంతర సంసిద్ధతతో ఉంటాయని, తగిన నిర్ణయాలు తీసుకుంటాయని ఈ కూటమి వెబ్‌సైట్‌ చెబుతోంది.)

జ: నాటో (NATO - నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌)

  • కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2024, ఏప్రిల్‌ 4న రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఎవరి పదవీ కాలం ముగియడంతో ఖాళీ అయిన రాజస్థాన్‌లోని రాజ్యసభ సీటు నుంచి సోనియా ఎగువ సభ సభ్యురాలిగా అడుగు పెట్టారు? (రెండున్నర దశాబ్దాల పాటు లోక్‌సభలో ఎంపీగా విధులు నిర్వహించిన సోనియా రాజ్య   సభకు ఎంపికవడం ఇదే తొలిసారి.)

జ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని