కరెంట్‌ అఫైర్స్‌

ఎయిర్‌ పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్‌నేషనల్‌ (ఏసీఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్‌ పోర్ట్‌ సర్వీస్‌ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) విభాగంలో 2023కు గాను ఆసియా - పసిఫిక్‌ ప్రాంతంలో ఉత్తమ విమానాశ్రయంగా ఏది పురస్కారం గెలుచుకుంది?    

Updated : 18 May 2024 01:07 IST

మాదిరి ప్రశ్నలు

ఎయిర్‌ పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్‌నేషనల్‌ (ఏసీఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్‌ పోర్ట్‌ సర్వీస్‌ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) విభాగంలో 2023కు గాను ఆసియా - పసిఫిక్‌ ప్రాంతంలో ఉత్తమ విమానాశ్రయంగా ఏది పురస్కారం గెలుచుకుంది?
జ:
జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

కేంద్ర స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2011-12లో పట్టణ ప్రాంతాల్లో సగటు నెలవారీ తలసరి వినియోగదారు వ్యయం రూ.2630 ఉండగా, అది 2022 ఆగస్ట్‌ 2023 జులై మధ్య నాటికి ఎంతకు పెరిగింది? (అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.1430 నుంచి రూ.3773కు పెరిగింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న డీబీటీలు, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, రైతుల ఆదాయాన్ని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడం వంటి అంశాల్లో ప్రభుత్వాలు తీసుకున్న చొరవల ఫలితంగా ప్రజల ఖర్చు చేసే సామర్థ్యం వృద్ధి చెందినట్లు నివేదిక వెల్లడించింది.)
జ:
రూ.6459

ఏ నాలుగు దేశాలతో కూడిన యూరోపియన్‌ స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ) రానున్న 15 ఏళ్లలో భారత్‌లో 100 బిలియన్‌ డాలర్ల (రూ.8,27,523 కోట్లు) పెట్టుబడులు పెట్టడంతో పాటు 10 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు సంబంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)ను భారత్‌తో కుదుర్చుకుంది? (రెండు ప్రాంతాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టెపా) పేరుతో దీన్ని కుదుర్చుకున్నాయి.)
జ:
స్విట్జర్లాండ్‌, నార్వే, ఐస్‌ల్యాండ్‌, లిచెన్‌స్టీన్‌గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని