కరెంట్‌ అఫైర్స్‌

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఒకటికి మించిన లక్ష్యాలను ఒకేసారి అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల అత్యాధునిక ఖండాంతర అణుక్షిపణి అగ్ని - 5ను ఏ రోజున తొలిసారిగా విజయవంతంగా ప్రయోగించింది?

Published : 19 May 2024 00:19 IST

మాదిరి ప్రశ్నలు

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఒకటికి మించిన లక్ష్యాలను ఒకేసారి అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల అత్యాధునిక ఖండాంతర అణుక్షిపణి అగ్ని - 5ను ఏ రోజున తొలిసారిగా విజయవంతంగా ప్రయోగించింది? (‘మిషన్‌ దివ్యాస్త్ర’ పేరిట ఒడిశా తీర సమీపంలోని అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీనిలో తొలిసారిగా వాడిన మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ ఎంట్రీ వెహికల్‌ (ఎంఐఆర్‌వీ) సాంకేతికత ద్వారా ఒకే క్షిపణితో వేర్వేరు లక్ష్యాలపై అనేక వార్‌ హెడ్లను పూర్తి కచ్చితత్వంతో ప్రయోగించవచ్చు. 5,000 నుంచి 5,800 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను అగ్ని- 5 ఛేదించగలదు. తక్కువ బరువున్న వార్‌ హెడ్లను అమర్చే పక్షంలో క్షిపణి రేంజ్‌ ఏకంగా 8,000 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది.)

జ: 2024, మార్చి 11


వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం - 2019 (సీఏఏ - సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌  యాక్ట్‌)ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ రోజున నోటిఫికేషన్‌ జారీ చేసింది? (సీఏఏకు నాలుగేళ్ల కిందటే పార్లమెంటు ఆమోద ముద్ర పడినా దేశవ్యాప్త వ్యతిరేకత, పూర్తి నిబంధనలపై సందిగ్ధత తదితరాల నేపథ్యంలో అమలు వాయిదా పడుతూ వస్తోంది. మతం ప్రాతిపదికగా భారత పౌరసత్వం కల్పిస్తున్న తొలి చట్టం ఇది. 2014, డిసెంబరు 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ (ముస్లిమేతర శరణార్థులు)లకు ఈ చట్టం ప్రకారం ఎలాంటి రుజువులు, ధ్రువీకరణలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం మంజూరు చేస్తారు. అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు.)

జ: 2024, మార్చి 11





గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని