ప్రాక్టీస్‌ బిట్లు

పర్యావరణ అర్థ శాస్త్రానికి కేంద్ర భావన ఏది?

Published : 21 May 2024 00:29 IST

పర్యావరణ అంశాలు

1. పర్యావరణ అర్థ శాస్త్రానికి కేంద్ర భావన ఏది?

1) మార్కెట్‌ వైఫల్యం
2) డిమాండ్‌ వైఫల్యం 
3) పంపిణీ వైఫల్యం
4) వినియోగదారుడి వైఫల్యం

2. ప్యారిస్‌లో జరిగిన కాప్‌-21 సమ్మేళనంలో భూతాపాన్ని ఎంతకు పరిమితం చేయాలని నిర్ణయించారు?

  1) పారిశ్రామిక స్థాయికి ముందున్న దానికంటే 3  సెంటీగ్రేడ్లు ఎక్కువ 
  2) పారిశ్రామిక స్థాయికి ముందున్న దానికంటే ఒక సెంటీగ్రేడ్‌ ఎక్కువ 
  3) పారిశ్రామిక స్థాయికి ముందున్న దానికంటే 2  సెంటీగ్రేడ్లు ఎక్కువ 
  4) పారిశ్రామిక స్థాయికి ముందున్న దానికంటే 4    సెంటీగ్రేడ్లు ఎక్కువ 

3. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో లేనిది?

1) అందరికీ ఇంటర్నెట్‌ లభ్యత
2) అందరికీ మంచినీరు లభ్యత 
3) అందరికీ సుస్థిర శక్తి వనరుల లభ్యత 
4) అందరికీ మంచి ఉద్యోగాల కోసం ప్రోత్సాహం

4. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పేదరికానికి సంబంధించి ఏమని ఉంది?

  1) సర్వత్రా, అన్ని రూపాల్లో పేదరికం అంతమవ్వాలి.
  2) 50% పేదరికం 2030 నాటికి అంతమవ్వాలి.
  3) 75% పేదరికం 2030 నాటికి అంతమవ్వాలి.
  4) నిర్ధారిత లక్ష్యమేమీ తెలపలేదు.

5. కింది ప్రవచనాలను పరిశీలించి సరైనదాన్ని గుర్తించండి. 

ఎ) ప్రకృతి వైపరీత్యాలు, శీతోష్ణస్థితిలో కలిగే మార్పులు సుస్థిరాభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటివి.
బి) శీతోష్ణస్థితిలో మార్పులు వ్యవసాయోత్పత్తి దిగుబడులు, వ్యవసాయరంగంపై ఆధారపడి జీవనాధారాన్ని గడిపే సమాజాలు, ఆహారభద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
1) ఎ    2) బి    3) ఎ, బి   4) ఏదీకాదు

సమాధానాలు: 1-1; 2-3; 3-1; 4-1; 5-3. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని