కరెంట్‌ అఫైర్స్‌

2024, మార్చి 12న నయాబ్‌ సింగ్‌ సైనీ ఏ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు?

Published : 23 May 2024 00:36 IST

మాదిరి ప్రశ్నలు

2024, మార్చి 12న నయాబ్‌ సింగ్‌ సైనీ ఏ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు? (మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టారు.)

జ: హరియాణా


ప్రపంచ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (వాడా) 2022కు సంబంధించి తాజాగా వెలువరించిన డోపింగ్‌ నివేదిక అంశాల ప్రకారం నిషేధిత ఉత్ప్రేరకాలు వినియోగించిన వారిలో ఏ దేశ క్రీడాకారులు అగ్రస్థానంలో ఉన్నారు? (దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, అమెరికా, ఖతార్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తొలి స్థానంలో నిలిచిన దేశం నుంచి గరిష్ఠంగా 127 మంది డోపీలుగా దొరికిపోయారు. వాడా విడుదల చేసిన పదేళ్ల అంతర్జాతీయ అధ్యయన ఫలితాల ప్రకారం డోపింగ్‌ కేసుల్లో మైనర్ల సంఖ్య ప్రాతిపదికన తొలి మూడు స్థానాల్లో రష్యా, ఇండియా, చైనాలు నిలిచాయి. రేసుగుర్రాల కోసం ఉద్దేశించిన లిగండ్రాల్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి, వాడి, డోప్‌ పరీక్షల్లో దొరికిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) అంగీకరించింది. భారత్‌లో జాతీయ యాంటీ డోపింగ్‌ చట్టం 2022 ఆగస్టులో అమల్లోకి వచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు.)

జ: భారత్‌


గాజాలో వేల మందికి ఆహార పదార్థాలను అందిస్తోన్న స్వచ్ఛంద సంస్థ ‘డబ్ల్యూసీకే’ జీపును ఇజ్రాయెల్‌ డ్రోన్లు ఇటీవల పేల్చి వేశాయి. ఈ ఘటనలో ఆరుగురు విదేశీ సిబ్బంది, ఒక పాలస్తీనా డ్రైవర్‌ మరణించారు. డబ్ల్యూసీకే పూర్తి రూపం ఏమిటి? (డబ్ల్యూసీకేను 2010లో స్పానిష్‌ అమెరికన్‌ చెఫ్‌ జోస్‌ ఆండ్రెస్‌ ప్రారంభించారు. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం వాషింగ్టన్‌ డీసీలో ఉంది.)

జ: వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని