కరెంట్‌ అఫైర్స్‌

ఎవరెస్ట్‌ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించిన మహిళగా ఫుంజో లామా ప్రపంచ రికార్డు సృష్టించారు. నేపాల్‌లోని గూర్ఖా జిల్లాకు చెందిన ఈమె 14.31 గంటల్లో దీన్ని అధిరోహించారు.

Updated : 25 May 2024 01:44 IST

వరెస్ట్‌ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించిన మహిళగా ఫుంజో లామా ప్రపంచ రికార్డు సృష్టించారు. నేపాల్‌లోని గూర్ఖా జిల్లాకు చెందిన ఈమె 14.31 గంటల్లో దీన్ని అధిరోహించారు. 2024, మే 22న మధ్యాహ్నం 3.52 గంటలకు బేస్‌క్యాంపు నుంచి పర్వతారోహణను ప్రారంభించి, 2024, మే 23 ఉదయం 6.23 గంటలకు 8,848 మీటర్ల శిఖరాగ్రానికి చేరుకున్నారు.


వియత్నాం కొత్త అధ్యక్షుడిగా టో లామ్‌ (66) నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ పార్లమెంట్‌ 2024, మే 22న ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన భద్రతా సంస్థల అధిపతిగా ఉన్నారు.


గోళశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక ‘షా ప్రైజ్‌’ ఇండో-అమెరికన్‌ ఆస్ట్రానమీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ ఆర్‌.కులకర్ణికి లభించింది. గామా కిరణాల పేలుళ్లు, సూపర్‌నోవా, అంతరిక్ష వస్తువుల పరిశీలన తదితర అంశాల్లో కనుక్కున్న విషయాలకుగానూ కులకర్ణికి ఈ అవార్డు దక్కింది. ఈయన కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఈ అవార్డు కింద ఆయనకు సుమారు రూ.10 కోట్లు (1.2 మిలియన్‌ డాలర్లు) బహుమతిగా లభిస్తాయి.


ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి ప్రీతి స్మిత (40 కేజీలు) ప్రపంచ రికార్డుతో సహా పసిడి పతకాన్ని నెగ్గింది. 2024, మే 23న లిమా (పెరూ)లో జరిగిన స్నాచ్‌లో 57 కేజీలు ఎత్తిన ప్రీతి, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 76 కేజీలు లిఫ్ట్‌ చేసి ప్రపంచ రికార్డు (75 కేజీలు)ను అధిగమించింది. మొత్తం మీద 133 కేజీలతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. 

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని