కరెంట్‌ అఫైర్స్‌

‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’పై అధ్యయనం చేయడానికి ఎవరి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను 2024, మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది?

Published : 27 May 2024 00:58 IST

మాదిరి ప్రశ్నలు

‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’పై అధ్యయనం చేయడానికి ఎవరి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను 2024, మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది?

జ: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (కోవింద్‌తోపాటు కమిటీ సభ్యులైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఫైనాన్స్‌ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్, లోక్‌సభలో మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌లు రాష్ట్రపతికి నివేదిక అందజేశారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల ఈ నివేదికలో ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫార్సులు చేసింది. తొలుత లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసన సభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లోగా అన్ని రకాల స్థానిక సంస్థలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది.) 


2019, డిసెంబరులో తొలిసారిగా కొవిడ్‌ వ్యాధికారక కరోనా వైరస్‌ విస్తృతి బయటపడ్డాక తొలి రెండేళల్లో ప్రపంచవ్యాప్తంగా 84 దేశాల్లో ప్రజల ఆయుర్దాయం ఎన్నేళ్ల మేర తగ్గినట్లు లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఇటీవల వెల్లడించింది? (మెక్సికో, పెరూ, బొలీవియా లాంటి ప్రాంతాల్లో ఆయు క్షీణత మరింత ఎక్కువగా నమోదైంది.)

జ: 1.6 ఏళ్లు


స్వాతంత్య్రానంతరం దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని ఆమోదించిన తొలిరాష్ట్రంగా ఏది వార్తల్లో నిలిచింది? (2024, ఫిబ్రవరి 7న ఈ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024, మార్చి 11న ఆమోదం తెలిపారు.)

జ: ఉత్తరాఖండ్‌


కరెంట్‌ అఫైర్స్‌

భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లకు అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నుంచి ప్రతిష్ఠాత్మక డీన్స్‌ మెడల్‌ లభించింది.  ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది. 

  • ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కరించిన టైఫాయిడ్‌ కాంజుగేట్‌ టీకా - టైప్‌బార్‌ టీసీవీ, రొటావైరస్‌ టీకా - రొటావ్యాక్, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ టీకా - జెన్‌వ్యాక్‌తో పాటు 19 టీకాలను భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తోంది. వివిధ దేశాలకు ఇప్పటివరకు 900 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేసింది.

కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ 100 బిలియన్‌ డాలర్ల మైలురాయిని అధిగమించింది. గ్రూప్‌ సంస్థలు అల్ట్రాటెక్, గ్రాసిమ్, హిందాల్కో, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, వొడాఫోన్‌ ఐడియా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, టీసీఎన్‌ఎస్‌ క్లాతింగ్, ఆదిత్య బిర్లా మనీ, సెంచురీ టెక్స్‌టైల్స్, సెంచురీ ఎంకా కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.8.51 లక్షల కోట్లుగా నమోదైంది.


త్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్‌కు చెందిన ఆర్తి అనే 18 ఏళ్ల పింక్‌ ఈ-రిక్షా డ్రైవర్‌కు లండన్‌లో ప్రతిష్ఠాత్మకమైన ‘అమల్‌ క్లూనే మహిళా సాధికారత పురస్కారం’ లభించింది. బకింగ్‌హాం ప్యాలెస్‌లో కింగ్‌ చార్లెస్‌-3 ఆమెకు దీన్ని ప్రదానం చేశారు.


యిరిండియా చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి (సీఎఫ్‌ఓ)గా సంజయ్‌ శర్మ 2024, మే 24న నియమితులయ్యారు. జూన్‌ 10న ఆయన ఈ బాధ్యతలు చేపడతారు.


కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని