విద్యార్థులే రూపొందించిన శాటిలైట్‌ ప్రోగ్రాం

కృత్రిమ ఉపగ్రహ నిర్మాణం, స్పేస్‌ మిషన్స్‌తో సంబంధమున్న ఇంజినీరింగ్, సాంకేతిక అభివృద్ధి అంశాలను విద్యార్థులు అనుభవపూర్వకంగా గ్రహించేందుకు థాపర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కృషి చేస్తోంది.

Published : 29 May 2024 00:29 IST

కృత్రిమ ఉపగ్రహ నిర్మాణం, స్పేస్‌ మిషన్స్‌తో సంబంధమున్న ఇంజినీరింగ్, సాంకేతిక అభివృద్ధి అంశాలను విద్యార్థులు అనుభవపూర్వకంగా గ్రహించేందుకు థాపర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కృషి చేస్తోంది. పటియాలా కేంద్రంగా ఉన్న ఈ డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీ విద్యార్థుల బృందం నాలుగేళ్ల కిందట థాపర్‌ శాటిలైట్‌ ‘థాపర్‌శాట్‌’ నిర్మాణం ప్రారంభించింది. ఇది ఇప్పుడు సిద్ధమై.. పరీక్షలు తుది దశలో ఉన్నాయి.  

గ్రీన్‌హౌస్‌ వాయువులైన కార్బన్‌ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌ల వల్ల కలిగే కాలుష్యం, ఉత్తర భారతదేశ నేలల్లో తేమ శాతాన్ని కొలవడం... మొదలైన విషయాలను ఈ కృత్రిమ ఉపగ్రహం పర్యవేక్షిస్తుంది. దీని లాంచింగ్‌ ప్రక్రియ వివరాలను ఈ సంస్థ స్టూడెంట్‌ శాటిలైట్‌ ప్రోగ్రాం బృందం త్వరలోనే ఇస్రోకు సమర్పించనుంది.  థాపర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, పటియాలా క్యాంపస్‌లో.. అంతరిక్ష పరిశ్రమ ప్రతినిధులు, దేశంలోని ఇతర విద్యాసంస్థల ప్రముఖులతో ఇటీవల సమావేశాన్ని నిర్వహించారు. దీంట్లో వ్యవసాయాభివృద్ధికి సంబంధించిన విధాన రూపకల్పనలో థాపర్‌శాట్‌ ప్రాముఖ్యం, అంతరిక్ష సాంకేతిక రంగంలో స్టార్టప్‌ల ఆవశ్యకత, సామాజిక అవసరాలకు సాంకేతికతను వినియోగించటంపై చర్చించారు. 
వెబ్‌సైట్‌: www.thapar.edu


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని